Asianet News TeluguAsianet News Telugu

‘రాజ రాజ చోర’..అంటున్న శ్రీ విష్ణు (ఫస్ట్ లుక్)

శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా అతని కొత్త చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు శనివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 

Sree Vishnu's new movie Raja Raja Chora First Look
Author
Hyderabad, First Published Feb 29, 2020, 2:05 PM IST

యంగ్ హీరో శ్రీవిష్ణు కెరీర్ పరంగా ఈ మధ్యన వచ్చిన డిజాస్టర్ చిత్రంతో కాస్తంత వెనకబడ్డాడు. అయితేనేం తను ఆలోచనలో,ప్రాజెక్టు ఎంపికలో వెనకబడలేదని ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు. అందుకు సాక్ష్యం..అతని తాజా చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్. శ్రీ విష్ణు పుట్టినరోజు సందర్భంగా అతని కొత్త చిత్రం ఫస్ట్ లుక్ ని ఈ రోజు శనివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రాజ రాజ చోర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హసిత్ గోలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సునయన హీరోయిన్.

నిర్మాత మాట్లాడుతూ...‘‘శ్రీ విష్ణు, హసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. మా హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్ ను, ఫస్ట్ లుక్ ని విడుదల చేయటం ఆనందంగా ఉంది.  ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది’’ అని తెలిపారు చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్.

తనికెళ్ళ భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : వేదరామన్, సంగీతం : వివేక్ సాగర్, ఎడిటింగ్ : విప్లవ్ నైషధం, ఆర్ట్ : కిరణ్ కుమార్ మన్నె, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కీర్తి చౌదరి, సహ నిర్మాత : వివేక్ కూచి భొట్ల, నిర్మాతలు : టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, రచన-దర్శకత్వం : హసిత్ గోలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios