సౌత్ లో శ్రీయ శరన్ అగ్ర హీరోలందరితో నటించింది. ఎక్కవకాలం తిరుగులేని స్టార్ గా రాణించింది. సౌత్ లో శ్రీయ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య లాంటి అగ్ర హీరోలతో రొమాన్స్ చేసింది.  తర్వాతి తరం హీరోలైన పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ లతో కూడా శ్రీయ ఆడి పండింది. 

కొత్త హీరోయిన్ల హవా పెరిగాక శ్రీయకు కాస్త అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ అప్పుడప్పుడూ సీనియర్ హీరోల సరసన శ్రీయ ఛాన్సులు అందుకుంటోంది. ఇదిలా ఉండగా 2018లో శ్రీయ తన రష్యన్ ప్రియుడు ఆండ్రూ కొశ్చివ్ ని వివాహం చేసుకుంది. 

వీరిద్దరి అన్యోన్యత గురించి మాటల్లో వివరించలేం. ఒక్కసారి వీరి సోషల్ మీడియాని గమనిస్తే ఈ దంపతులు ఇద్దరూ చేసే అల్లరి ఆశ్చర్య పరుస్తుంది. వీరు భార్య భర్తలా లేక చిన్న పిల్లలా అనే అనుమానం కలగక మానదు. ఇటీవల ఈ అల్లరి కాస్త ఎక్కువైంది. అయినా ఇంకేం చేస్తారులే.. లాక్ డౌన్ కారణంగా శ్రీయ, కొశ్చివ్ స్పెయిన్ లో చిక్కుకుపోయారు. ఇంట్లో  నుంచి బయటకు రాలేని పరిస్థితి. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Miss Paani puri.... #stayathome

A post shared by Shriya Saran (@shriya_saran1109) on May 9, 2020 at 8:33am PDT

దీనితో శ్రీయ, కొశ్చివ్ ఒకరికొకరు వినోదాన్ని అందించుకుంటూ.. నెటిజన్లకు కూడా ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు. తాజాగా శశీయ తన ఇంస్టాగ్రామ్లో భర్తతో కొంటె పనులు చేస్తున్న వీడియో షేర్ చేసింది. వీధుల్లో పానీపూరి అమ్మేవాడి తరహాలో  పానీపూరీ.. పానీపూరీ అని కొశ్చివ్ అరుస్తున్నాడు. 

దీనితో శ్రీయ సడెన్ గా అతడి నోట్లో పానీపూరి పెట్టేసింది. ఒక్కసారిగా శ్రియ పగలబడి నేవ్వేసింది. ఈ వీడియోకి మిస్సింగ్ పానీపూరి అనే హ్యాష్ ట్యాగ్ జోడించింది. ఆ మధ్యన సోషల్ మీడియా లైవ్ లో ఓ నెటిజన్ శ్రీయ వక్షోజాలు సూపర్ అంటూ కామెంట్ చేశాడు.. దీనికి పక్కనే ఉన్న కొశ్చివ్ అవును నా భార్య వక్షోజాలు సూపర్.. ఇంకా కామెంట్స్ చేయండి అని నెటిజెన్లని ఎంకరేజ్ చేశాడు.