మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతాడు. అలాంటిది ఏదైనా ప్రత్యేక సందర్భం వస్తే ఇక తన సమయం మొత్తం కుటుంబానికే.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతాడు. అలాంటిది ఏదైనా ప్రత్యేక సందర్భం వస్తే ఇక తన సమయం మొత్తం కుటుంబానికే. ప్రస్తుతం చరణ్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు మెగాస్టార్ 152 చిత్రంలో కూడా నిర్మాణ భాగస్వామి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇంత బిజీలో కూడా చరణ్ తన తల్లి కొణిదెల సురేఖ పుట్టినరోజు వేడుకని ఘనంగా సెలెబ్రేట్ చేశాడు. 'హ్యాపీ బర్త్ డే టూ మై ఫస్ట్ లుక్.. లవ్యూ మామ్' అని తన తల్లికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో బర్త్ డే సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలని షేర్ చేశాడు. 

రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇక సినిమాల విషయానికి వస్తే.. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. చరణ్ నక్సలైట్ గా నటించబోతున్నట్లు ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం లో చరణ్ రోల్ చాలా కీలకం అని తెలుస్తోంది. 

View post on Instagram