Asianet News TeluguAsianet News Telugu

భీష్మ ట్రైలర్: నా పొలంలో కూడా మొలకలొచ్చేలా ఉన్నాయ్!

త్వరలో బ్యాచ్ లర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేయబోతున్న నితిన్ ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసితో కనిపిస్తున్నాడు. ఛల్ మోహన్ రంగ - లై సినిమాలతో ఊహించని డిజాస్టర్స్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు భీష్మ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈ నెల 21న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ట్రైలర్ మరీంత బజ్ క్రియేట్ చేసింది

nitin rashmika Bheeshma Theatrical Trailer
Author
Hyderabad, First Published Feb 17, 2020, 9:10 PM IST

త్వరలో బ్యాచ్ లర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేయబోతున్న నితిన్ ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని కసితో కనిపిస్తున్నాడు. ఛల్ మోహన్ రంగ - లై సినిమాలతో ఊహించని డిజాస్టర్స్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు భీష్మ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈ నెల 21న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ట్రైలర్ మరీంత బజ్ క్రియేట్ చేసింది.

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు.  నా పొలంలో కూడా మొలకలు వచ్చాయి అంటూ నితిన్ లవర్ కోసం ఆశపడుతున్న కుర్రాడిలా కనిపిస్తున్నాడు. భీష్మ పేరు పెట్టినందుకె తనకు ఒక్క అమ్మాయి కూడా పడటం లేదని చెబుతుండడం కామెడీగా ఉంది. ట్రైలర్ రిలీజైన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నితిన్ సినిమాలో చాలా డిఫరెంట్ హావభావాలతో కనిపిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఛలో దర్శకుడు  వెంకీ కుడుములు తెరకెక్కిస్తున్నాడు.

ఇక రష్మిక మందన్న పాత్ర కూడా సినిమాలో హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.  గత ఏడాది చివరిలోగా వస్తుంది అనుకున్న ఈ సినిమా ఫిబ్రవరికి  షిఫ్ట్ అయ్యింది. 2020 ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రీ టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మించగా ఛలో చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన మహతి స్వర సాగర్ భీష్మకు కూడా స్వరాలు అందించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios