Asianet News TeluguAsianet News Telugu

బాల‌కృష్ణ 105.. కొత్త పోస్టర్ చూశారా..?

బాలకృష్ణ 105 వ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.  ఈ సినిమా కోసం బాలకృష్ణ కొత్తగా కనిపిస్తున్నారు.  
 

NBK 105 : Balakrishna's new look
Author
Hyderabad, First Published Oct 7, 2019, 5:06 PM IST

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. `జైసింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న రెండో చిత్ర‌మిది. బాల‌కృష్ణ న‌టిస్తోన్న 105వ చిత్రమిది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ సినిమాలో బాల‌కృష్ణ పాత్ర‌కు సంబంధించిన మ‌రో లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ ప‌వ‌ర్‌ఫుల్ లుక్‌లో బాల‌కృష్ణ ర‌క్తం అంటిన క‌త్తిని పట్టుకుని ఉన్నారు. ముఖం అంతా రంగుల‌తో నిండి ఉంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ అక్టోబ‌ర్ 18 నుండి రామోజీ ఫిలిమ్ సిటీలో జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్ట‌ర్ చిన్నా భారీ విలేజ్ సెట్‌ ను వేశారు. ఈ చిత్రంలో బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ నటిస్తోంది.

బాలయ్య సినిమాలో సోనాల్ నటించడం ఇది మూడోసారి. ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే ‘లెజెండ్’, ‘డిక్టేటర్’ సినిమాల్లో బాలకృష్ణ సరసన నటించింది సోనాల్‌ చౌహాన్‌‌తో పాటు వేదిక మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.షాయాజీ షిండే, నాగినీడు, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, ధన్‌రాజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్స్: సి.వి.రావ్, పత్సా నాగరాజు
కథ: పరుచూరి మురళి
మ్యూజిక్: చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఆర్ట్: చిన్నా
పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు, అరివు
కొరియోగ్రఫీ: జానీ మాస్టర్
 

Follow Us:
Download App:
  • android
  • ios