బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, నటుడు షాహిద్ కపూర్ కొంతకాలంపాటు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. కొన్నేళ్లపాటు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ వ్యక్తిగత కారణాల వలన విడిపోయారు. ప్రస్తుతం షాహిద్, కరీనా ఎవరి జీవితాల్లో వారు బిజీగా ఉన్నారు.

తాజాగా కరీనా కపూర్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ తో బ్రేకప్ గురించి స్పందించింది. 'జబ్ వి మెట్' సినిమా తన కెరీర్ నే మార్చేసిందని.. ఈ సినిమాలో షాహిద్ తో కలిసి నటించానని అన్నారు. 'జబ్ వి మెట్' సినిమా కథ ముందుగా షాహిద్ విని తనను ఆ సినిమా చేయమని చెప్పాడని.. అలా ఆ సినిమాలో భాగమయ్యానని కరీనా తెలిపింది.

చిన్నపిల్లని ప్రెగ్నంట్ చేశాడు.. మాజీ ప్రియుడిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

'జబ్ వి మెట్', 'తషాన్' సినిమాలకు మధ్య మా ఇద్దరి జీవితాల్లో చాలా జరిగిందని.. మా ఇద్దరి విషయంలో విధికి ఓ ప్రత్యేకమైన ప్లాన్ ఉందని.. అందుకే విడిపోయామని.. మా దారులు మేం చూసుకున్నామని చెప్పుకొచ్చింది.

ఆ తరువాత 'తషాన్' సినిమా గురించి స్పందిస్తూ.. 'తషాన్' సినిమా షూటింగ్ లో సైఫ్ ని కలిసినట్లు.. ఈ సినిమా తన కెరీర్ తో పాటు జీవితాన్ని కూడా మార్చేసిందని అన్నారు. ఎందుకంటే ఆ సినిమాలో తన కలల రాకుమారుడిని కలిశానని.. అతడినే ప్రేమించి, పెళ్లి చేసుకున్నానని చెప్పారు.