బాలీవుడ్ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ తో చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించింది హీరోయిన్ సనా ఖాన్. అతడిని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. కానీ ఇద్దరికీ బ్రేకప్ అయింది.

మెల్విన్ తనను మోసం చేశాడని.. అతడికి చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని.. ఈ విషయాలేవీ తనకు తెలియకపోవడంతో తనను కూడా మోసం చేయాలనుకున్నాడని రీసెంట్ గా మీడియా ముందు వెల్లడించింది.

ఆ కొరియోగ్రాఫర్ నన్ను మోసం చేసి మరో అమ్మాయితో.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

రోజూ మెల్విన్ కి సంబంధించిన ఏదొక విషయాన్ని బయటపెడుతూ అతడి ఇమేజ్ కి డ్యామేజ్ కలిగిస్తోంది. దీంతో మెల్విన్ కూడా సనాఖాన్ పై పరోక్షంగా కామెంట్స్ చేస్తున్నారు. దాంతో సనాఖాన్ కి కోపం మరింత పెరిగిపోయి అతడి గురించి వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతోంది.

మోసం అనేది పొరపాటున జరగదని.. అంతా ప్లానింగ్ తోనే జరుగుతుందని.. చాలా రోజులుగా తను ఏడుపుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని.. మెల్విన్ అంతగా బాధపెట్టాడని చెప్పుకొచ్చింది. తన పరిస్థితే ఇలా ఉంటే అతను మోసం చేసిన మిగతా అమ్మాయిల జీవితాలు ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే భయం ఉందని.. ఓ చిన్నపిల్లని గర్భిణిని చేసి వదిలేశాడంట అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

ఆ విషయం తెలిసాక తన గుండె పగిలిపోయిందని.. ఎందరో అమ్మాయిల నుండి డబ్బులు తీసుకున్నాడని అన్నారు. డాన్స్ టీచర్ అంటే ఇలా ప్రవర్తిస్తాడా..? నాకు భయం వేస్తోందని అన్నారు. అల్లా మీకు తగిన గుణపాఠం చెప్తారని షాకింగ్ కామెంట్స్ చేశారు.