ఫిలిం ఇండస్ట్రీ అనేది పూర్తిగా మేల్ డామినేటెడ్ అన్న పేరుంది. అయితే ఇండస్ట్రీలో కూడా తమదైన స్టైల్‌లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అంతేకాదు వీళ్లు స్టార్ హీరోలక ధీటుగా కాసులు కూడా వెనకేస్తున్నారు. శ్రీ లంక లో మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించిన జాక్వెలిన్‌ తరువాత హిందీ సినీ రంగం ప్రవేశం చేసింది. బాలీవుడ్‌ హీరోయిన్ గా కొనసాగుతూనే ఐటమ్ నంబర్స్‌తో ఆకట్టుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది. యాక్టింగ్‌తో పాటు మోడలింగ్‌, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌లలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ విషయంలోనూ కాస్త గట్టిగానే ఉంటుందన్న పేరుంది.

ఈ హాట్ బ్యూటీ ముందుగా గ్లామర్ ఫీల్డ్‌లోకి శ్రీలంకలోనే అడుగుపెట్టింది. 2006లో మిస్‌ శ్రీలంకగా అవార్డును సైతం గెలుచుకుంది. అదే ఏడాది మిస్‌ యూనివర్స్‌ పోటిల్లో శ్రీలంక తరుపున పాల్గొని సత్తా చాటింది. ఈ కాంపిటీషన్స్‌ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో భారత్‌లోనూ జాక్వెలిన్‌కు మోడలింగ్‌ ఆఫర్లు వచ్చాయి. మన దేశంలో మోడల్‌గా అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీకి బాలీవుడ్ అవకాశాలు క్యూ కట్టాయి. సుజయ్‌ గోష్ దర్శకత్వంలో తెరకెకక్కిన అల్లాదిన్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది జాక్వలిన్‌.

మర్డర్‌ 2, హౌస్‌ఫుల్ 2, కిక్‌ లాంటి సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన జాక్వెలిన్‌ ప్రాపర్టీస్‌ విలువ దాదాపు 9 మిలియన్‌ డాలర్లు ఉంటుందట. అంటే మన కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు 70 కోట్ల వరకు ఆమె ప్రాపర్టీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు దాదాపు 2 నుంచి 3 కోట్ల వరకు పేమెంట్ తీసుకుంటుంది. సల్మాన్ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన కిక్‌ సినిమాకైతే ఏకంగా 6 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకుందట జాక్‌. స్నాప్‌డీల్, హెచ్‌టీసీ వన్‌ లాంటి ప్రముఖ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది జాక్వెలిన్‌. ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం సాహోలోనూ స్పెషల్ సాంగ్‌లో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది జాక్వెలిన్.