Asianet News TeluguAsianet News Telugu

హీరో సుహాస్ కోసం 'సలార్' నిర్మాతలు రంగంలోకి.. ఇది క్రేజీ కదా..

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు క్రేజీ హీరోగా మారాడు. సుహాస్ నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి.

Salaar Producers to release tollywood hero suhas prasannavadanam movie dtr
Author
First Published Apr 25, 2024, 12:06 PM IST

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాస్ ప్రస్తుతం చిన్న బడ్జెట్ చిత్రాలకు క్రేజీ హీరోగా మారాడు. సుహాస్ నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాల్లో హీరోగా నటిస్తూనే హిట్ 2 చిత్రంలో విలన్ గా ఆశ్చర్యపరిచాడు. 

ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్ అనే చిత్రం విడుదలయింది. ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది.ఇటీవల సుహాస్ నుంచి శ్రీరంగ నీతులు అనే చిత్రం విడుదలయింది. అయితే ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. మే 3న ఈ హీరో మరో చిత్రంతో వచ్చేస్తున్నాడు.  

సుహాస్ నటించిన ప్రసన్న వదనం చిత్రం మే 3న రిలీజ్ అవుతోంది. ఊహించని విధంగా ఈ చిత్ర రిలీజ్ కోసం సలార్, కెజిఎఫ్ నిర్మాతలు రంగంలోకి దిగారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. 

కర్ణాటకలో సలార్ చిత్రాన్ని నిర్మించిన హోంబాలే సంస్థ ప్రసన్నవదనం చిత్రాన్ని రిలీజ్క్ చేస్తుండడం విశేషం. యంగ్ హీరో సుహాస్ చిత్రం కోసం పాన్ ఇండియా నిర్మాతలే పోటీ పడుతున్నారంటే గొప్ప ఘనతే అని చెప్పొచ్చు. 

అర్జున్ వైకె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధం అవుతోంది. సుహాస్ వరుసగా కథా బలం ఉన్న ఎమోషనల్ కథలని ఎంచుకుంటున్నాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios