Asianet News TeluguAsianet News Telugu

'వరల్డ్ ఫేమస్ లవర్' టీమ్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తోంది ?

విజయ్ దేవరకొండ చాలా తెలివైన వాడు. తను ఎంపిక చేసే స్క్రిప్టులే కాక, తను జనాల్లోకి ఎలా వెళ్లాలనుకుంటున్నాడు...ఏ విధమైన రెస్పాన్స్ వారినుంచి ఆశిస్తున్నాడు అనేది ఊహింది..అందుకు తగ్గట్లు పావులు కలుపుతూంటారు. తాజాగా ప్రేమికుల రోజున వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డియర్ కామ్రేడ్ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత విజయ్ చేసిన చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమా మీద మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.

Is World Famous Lover Team accept result?
Author
Hyderabad, First Published Feb 17, 2020, 8:11 PM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చాలా తెలివైన వాడు. తను ఎంపిక చేసే స్క్రిప్టులే కాక, తను జనాల్లోకి ఎలా వెళ్లాలనుకుంటున్నాడు...ఏ విధమైన రెస్పాన్స్ వారినుంచి ఆశిస్తున్నాడు అనేది ఊహింది..అందుకు తగ్గట్లు పావులు కలుపుతూంటారు. తాజాగా ప్రేమికుల రోజున వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

డియర్ కామ్రేడ్ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత విజయ్ చేసిన చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమా మీద మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. డియర్ కామ్రేడ్ తో నిరాశపర్చిన విజయ్ ఈ సినిమాతోనైనా మంచి హిట్ కొడతాడని అందరూ భావించారు. కానీ డియర్ కామ్రేడ్ మాదిరిగానే ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.  అయితే సాధారణంగా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా...దాన్ని అధిగమించటానికి సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తూంటారు దర్శక,నిర్మాతలు.

అలాంటిదేమీ జరగలేదు. అలాగే నెగిటివ్ టాక్ ఎక్కువ ఉన్నప్పుడు హీరో కూడా కాస్త ఎక్కువగానే సినిమాని ప్రమోట్ చేస్తూంటాడు. అయితే విజయ్ దేవరకొండ మొహమాటం లేకుండా ఈ సినిమా  ప్రమోషన్ ని వదిలేసి తన తదుపరి చిత్రం షూటింగ్ లో బిజి అయ్యిపోయాడు. పూరి జగన్నాథ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక ఈ సినిమాలో చేసిన హీరోయిన్స్ అయినా ప్రమోట్ చేస్తున్నారా అంటే అదీ లేదు. నిర్మాత తరపు నుంచి ఇంక రూపాయి ఖర్చు పెట్టినా వేస్టే అన్నట్లుగా ఉన్నారు.

దాంతో ఎవరికి పట్టిన బిడ్డరా అన్నట్లు తయారైంది ఈ సినిమా పరిస్దితి.   మరో ప్రక్క ఈ సినిమాకు నెగెటివ్ టాక్ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవడంతో మొదటిరోజే ఈ సినిమాకి వసూళ్ళు పడిపోయాయి. రిలీజ్ కి ముందు ఉండాల్సిన బజ్ కూడా పెద్దగా లేకపోవడంతో ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. దానికి తోడు ప్రమోషన్లలో విజయ్ చాలా దూకుడుగా ప్రవర్తిస్తాడు. వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో అలా చేయలేదు. దాంతో 29 కోట్ల మేరకు బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం 10 కోట్ల షేర్ కూడా రావటం కనా కష్టం అని ట్రేడ్ తేల్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios