Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ కనగరాజ్ చిత్రం లో రజనీ క్యారక్టర్ అదా..షాకింగ్

లియో రిజల్ట్ తరువాత స్క్రిప్ట్ స్టేజ్‌లోనే లోకేష్ కనకరాజ్ మరింత కేర్ తీసుకుంటున్నారు.

Gold theme for Rajinikanth and Lokesh film!jsp
Author
First Published Mar 30, 2024, 4:43 PM IST


తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ (Lokesh) కనగరాజు లియో (Leo) చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తో తలైవర్ 171 (Thalaivar 171) ను అనౌన్స్ చేసారు. ఈ చిత్రం నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ రీసెంట్ గా రివీల్ చేశారు. ఈ చిత్రం కి సంబందించిన టైటిల్ టీజర్ విడుదల పై క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 22 వ తేదీన టైటిల్ ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ నేపధ్యంలో రిలీజ్ చేసిన  సూపర్ స్టార్ రజనీకాంత్ లుక్ తో కూడిన ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ ఫస్ట్ లుక్ లో రజినీకాంత్ ని బంగారపు వాచ్‌లతో సంకెళ్లు వేసినట్టు ఉంది. రజినీకాంత్ ఓ విలనీ నవ్వుతో అదిరిపోయే లుక్ లో ఉన్నారు. పోస్టర్ వెనక కూడా వాచ్ ఉంది. దీంతో టైం చుట్టూ ఈ సినిమా తిరుగుతుందా అనే అనుమానం కలుగుతుంది. ఈ స్టైలిష్ లుక్ కి ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 

ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. రెట్రో ఫిల్మ్ అని..తమిళ సిని వర్గాలు చెప్తున్నాయి. ఎనభైల్లో గోల్డ్ స్మగ్మింగ్ జరిగేది అనేది అని, అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఓ స్మగ్మర్ చుట్టూ తిరిగే ఓ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్తన్నారు. అయితే అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ... తలైవర్ 171 సినిమా కచ్చితంగా నా స్టైల్‌ లో ఉంటుంది. 100% ఇది నా స్టైల్ మూవీ అని చెప్పగలను. పోస్టర్ ఆధారంగా సినిమా కథ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఊహించేసుకుంటున్నారు. కానీ ప్రస్తుతానికి నేను ఏ విషయాన్ని చెప్పలేను. గతంలో రజినీ సర్ ను ప్రేక్షకులు ఫ్యాన్స్ చూడని విధంగా నేను చూపించబోతున్నాను. ఆయన్ను నా స్టైల్‌ లో చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. తన గత చిత్రాల మాదిరిగా ఇందులో డ్రగ్స్ ను చూపించబోవడం లేదని కూడా లోకేష్‌ క్లారిటీ ఇచ్చాడు.
 

లియో రిజల్ట్ తరువాత స్క్రిప్ట్ స్టేజ్‌లోనే లోకేష్ కనకరాజ్ మరింత కేర్ తీసుకుంటున్నారు. కేవలం స్క్రిప్ట్ వర్క్‌కే ఆరు నెలల పాటు కేటాయించిన డైరెక్టర్‌ జూన్‌లో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రజనీ సినిమా రిలీజ్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు లోకేష్‌. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios