Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ కౌశల్ ఎమోషనల్ పోస్ట్.. 'నా భార్య కల నెరవేరబోతోంది'!

దాదాపు రెండేళ్ల క్రితం నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో నటుడు, మోడల్ అయిన కౌశల్ మందా విజేతగా నిలిచాడు.

Bigg Boss 2 Kaushal manda emotional post on his new movie launch
Author
Hyderabad, First Published Feb 28, 2020, 3:25 PM IST

దాదాపు రెండేళ్ల క్రితం నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో నటుడు, మోడల్ అయిన కౌశల్ మందా విజేతగా నిలిచాడు. ఒకరకంగా చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ 2 కౌశల్ వన్ మాన్ షో తో ఏకపక్షంగా సాగింది. గీతా మాధురి మినహా మరెవరూ కౌశల్ కు పోటీనివ్వలేకపోయారు. ఎన్ని వివాదాలు ఉన్నపటికీ కౌశల్ టైటిల్ ఎగరేసుకు పోయాడు. 

బిగ్ బాస్ తెచ్చిపెట్టిన క్రేజ్ తో కౌశల్ క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయాడు. బిగ్ బాస్ తర్వాత కౌశల్ హీరోగా సినిమా చేసేందుకు చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. కౌశల్ హీరోగా నేడు ఓ చిత్రం ప్రారంభమైంది. 

ఈ సందర్భంగా కౌశల్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. నాతో పాటు మీరంతా ఈ చిత్ర ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారని తెలుసు. అంతే కాదు ఈ చిత్రం నా భార్య కల కూడా. ఎట్టకేలకు ఆమె కల నెరవేరబోతోంది. దర్శకుడు కృష్ణ బిగ్ బాస్ న బాడీ లాంగ్వేజ్ గమనించి ఈ కథ సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉండబోతోంది అని కౌశల్ తెలిపాడు. 

ఈ మూవీ లాంచ్ కు హీరో ఆది సాయికుమార్ అతిథిగా హాజరయ్యాడు. ఈ చిత్ర లాంచింగ్ కి సంబంధించిన ఫోటోలని కూడా కౌశల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పటికే కౌశల్ నటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. హీరోగా నటించనుండడంతో ఇది కౌశల్ కు కొత్త జర్నీ అని చెప్పొచ్చు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Here it is🥳!!! Happy to announce that My Movie No.2 post Big Boss is all set to hit the floors for shoot. So, Finally many of your dreams&my wife’s dream is going to come true and iam sure everybody will enjoy seeing me playing the role you actually wanted me to see from so long.I would also like to take a moment to thank my director krishna who got inspired with my big boss journey & designed a role that would match my personality & came to me with the good script & the good role and also thanking my producers & sending my best wishes to the entire team& technicians.Thanks for all my well wishers for all your blessings & it's becoz of all your love Iam here and I feel motivated #CountingOnBlessings #loveyouall #kaushalarmy #kaushalmanda

A post shared by k a u s h a l M a n d a (@kaushalmanda) on Feb 27, 2020 at 9:45pm PST

బాగ్ బాస్ సీజన్ 2లో కొన్ని రోజులకే కౌశల్ ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. కౌశల్ ఆర్మీ అంటూ అతడికి అభిమానగణం కూడా ఏర్పడింది. కౌశల్ బిగ్ బాస్ 2 సీజన్ గెలవడంతో కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios