కేరళ క్యూట్ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అమ్మడి పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియాలో అభిమానులు బర్త్ డే విషెస్ తో తెగ సందడి చేశారు. ఇక ఇదే సమయంలో బేబీ ప్రేమలో ఉందంటూ మరికొన్ని కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు.

భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా కూడా రూమర్స్ కి ఇంకాస్త బూస్ట్ ఇచ్చాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. గత కొంత కాలంగా అనుపమ ఒక క్రికెటర్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రికెటర్ ఎవరో తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. బుమ్రా అని సోషల్ మీడియాలో నిత్యం కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.  ఇక మంగళవారం బేబీ పుట్టినరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసింది.

కపుల్ గోల్స్ అంటూ ట్యాగ్ ఇవ్వడంతో బేబీ దాదాపు ప్రేమలో ఉన్నట్లు ఒక క్లారిటీ అయితే వచ్చింది. అదే విధంగా 24 అంటూ తన వయసు గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది. ఇక బుమ్రా కూడా నిప్పులో ఉప్పు వేసినట్లు.. డోంట్ గ్రో అప్.. ఇట్స్ ఏ ట్రాప్.. అని కామెంట్ చేశాడు. దీంతో నెటిజన్స్ వారిద్దరి ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. మరీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని.. వీరిద్దరు సోషల్ మీడియాలో దాగుడుమూతలు ఆడుతున్నారా? అనే డౌట్ వస్తోంది.