Asianet News TeluguAsianet News Telugu

‘అసురన్’ రీమేక్ తో అభిరామ్ ఎంట్రీ, సురేష్ బాబు సూపర్ స్కెచ్?

తమ సంస్దతో ప్రతష్టాత్మకంగా తయారు కాబోతున్న అసురన్ రీమేక్ ద్వారా ...అభిరామ్ ని పరిచయం చేస్తే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నారట. కథ ప్రకారం....వెంకటేష్ కు ఇధ్దరు కుమారులు ఉంటారు. 

Abhiram would be seen in the remake of Asuran?
Author
Hyderabad, First Published Dec 7, 2019, 9:23 AM IST

వారసుల పరంపర తెలుగు పరిశ్రమలో కొనసాగుతూనే ఉంది. మా సొంత డబ్బులుతో సినిమా తీసేటప్పుడు మా పిల్లలను హీరోగా తెరపైకి తెస్తే తప్పేంటి అనే ధోరణితో నిర్మాతలు ముందుకు వెళ్తున్నారు. టాలీవుడ్ పెద్ద కుటుంబాలలో ఒకటైన రామానాయుడు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే వెంకటేష్, రానా హీరోలుగా వచ్చారు. ఇప్పుడు రానా సోదరుడు,సురేష్ బాబు రెండో కుమారుడు దగ్గుపాటి అభిరామ్ ని సైతం రంగంలోకి దించుతున్నారు.

అయితే సురేష్ బాబు ప్లానింగ్ ఎప్పుడూ వేరుగా ఉంటుంది. ఏదో ఒక ప్రాజెక్టుతో తమ పిల్లలు జనం ముందుకు రావటానికి ఇష్టపడరు. వస్తే ..ముద్ర పడిపోవాలి..అంతే. అందుకే అలాంటి తరుణం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడా ఆ సమయం వచ్చినట్లు ఆయన భావిస్తున్నారట.

అలాంటి భర్త ఆమెకు అవసరమా.. చెన్నకేశవులు భార్యపై జీవిత కామెంట్స్!

తమ సంస్దతో ప్రతష్టాత్మకంగా తయారు కాబోతున్న అసురన్ రీమేక్ ద్వారా ...అభిరామ్ ని పరిచయం చేస్తే ఎలా ఉంటుందని పరిశీలిస్తున్నారట. కథ ప్రకారం....వెంకటేష్ కు ఇధ్దరు కుమారులు ఉంటారు. వాళ్ళది ఫుల్ లెంగ్త్ పాత్రే. అందుకే అందులో ఓ పాత్రను అభిరామ్ చేత చేయిస్తే ...అటు లాంచింగ్ అయినట్లు ఉంటుంది. అంతేకాకుండా వెంకటేష్ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో వెంకటేష్ యంగ్ గా కనిపించాల్సి ఉంటుంది.

అది చేయించినా బాగానే ఉంటుందనే ఆలోచన ఉంటుందట. అంతా అనుకున్నట్లు జరిగితే అభిరామ్ ని ఈ సినిమాతో లాంచ్ చేస్తే..ప్రత్యేకమైన ప్రమోషన్ లేకుండా... వెంకటేష్ ఇమేజ్ తో లాక్కెళ్లిపోవచ్చు. అందులోనూ సూపర్ సక్సెస్ అయిన చిత్రం రీమేక్ కావటంతో గ్యారెంటీగా సక్సెస్ అయ్యే అవకాసం ఉంటుంది.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సురేష్ బాబు తన వాళ్లతో చర్చలు జరుపుతున్నట్లు ఫిల్మ్ నగర వర్గాల సమాచారం. అయితే సురేష్ బాబు ఫ్యామిలో ఈ రీమేక్ తో అభిరామ్ రావటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, అభిరామ్ కు మాత్రం సోలో హీరోగా లాంచ్ కావాలనే ఆలోచన ఉందిట. దాంతో ఎటూ నిర్ణయించుకోలేకపోతున్నారట సురేష్ బాబు. ఈ మేరకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios