ఒకడికి రాష్ట్ర పరిస్థితి చూసీ చాలా బాదేసి ఎలాగైన పరిస్టితులని చక్కబరచాలి అనుకుని అది ఆ దేవుడి వల్లే సాద్యం అని దగ్గరలోని చిట్టడివికి వెళ్ళి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు.. 

అడవికి వెళ్ళి ఘోరంగా తపస్సు చేయడం మొదలుపెట్టాడు..

అంత ఘోరం చూడలేక దేవుడు ప్రత్యక్షమై 

దేవుడు : నీ ఘోరం నాకు నచ్చింది ఏం కావాలి కోరుకో

ఇతను : స్వామి రాష్ట్రం లో ఉన్న సమస్యలన్నీ చక్కబరచాలి..

దేవుడు : చూడు ఘోరం అన్నీ అంటే నా వల్ల కాదు కాని ఒక మూడు ప్రధాన సమస్యలు చెప్పు సాల్వ్ చేస్తాను..

అనేసరికి మనోడికి అనుమానం వచ్చింది.. కొంత కాలం నుంచి తపస్సులో ఉన్నా కదా అసలు ఇప్పుడు రాష్ట్రం లో ప్రధాన సమస్యలు ఎమున్నాయో తెలీక కాసేపు ఆలోచించి.. 

"వన్ మింట్ సామి" అనేసి లగెత్తుకుని ఆ అడవి బయట ఉన్న ఒక కాకా హోటల్ కి వెళ్ళాడు..

అక్కడ కొంత మంది రాష్ట్ర ప్రజలు ఉంటే వారిని అడిగాడు " ఇప్పుడు మన రాష్ట్రం లో ఉన్న మూడు ప్రధాన సమస్యలు ఏంటి.." అని వారు ఓవర్ యాక్షన్ చెయ్యకు మాకేం తెలుసు ఎదైన న్యూస్ చానల్ పెట్టుకుని చూడు తెలుస్తుంది అని అక్కడున్న టి.వి. వైపు చూసారు..  

ఘోరం కాసేపు అన్ని న్యూస్ చానల్స్ చూసి "వాకె" అని తల అడ్డంగా ఊపి తిరిగి దేవుడి దగ్గరకు వచ్చి గర్వంగా నిల్చున్నాడు..

దేవుడు : చెప్పు మీ రాష్ట్రం లోని ప్రధాన సమస్యలు.. 

ఘోరం : సామి మూడు సమస్యలున్నాయి..

1. ఒక క్రిటిక్ ఒక కథనాయకున్ని విమర్షిస్తున్నాడు సామే..

2. యాంకర్ ప్రతాప్ తాగి రోడ్ మీద అడ్డంగా దొరికి పొయాడంట సామే..

3. ఒక కళాకారుడు రాసలీలలతో నిలువునా దొఇకి పొయాడంట సామే...

అని ఘోరం గర్వంగా ఆన్సర్ చెప్పాడు..

దాంతో దేవుడికి ఫుల్ల్ బి.పి. లేచీ పక్కనే పొదల్లో ఉన్న దుడ్డు కర్ర తీసుకుని

అడివంత తిప్పి తిప్పి కొట్టాడు..

ఇక పరిగెత్తే ఓపిక లేక ఘోరం ఆగి 

ఘోరం : ఎందుకు కొడుతున్నావ్ సామే.. చెప్పి కొట్టు..

దేవుడు : నీ.. బోస్.డి.కే. రాష్ట్రం లో ప్రధాన సమస్యలు చెప్పరా అంటే.. ఎంట్రా నువ్వు చెప్పేది.. 

ఘోరం : నాకేం తెలుసు టి.వి.లో మొత్తం అదే హేడ్ లైన్స్, అవే డిబేట్స్, అవే స్క్రోలింగ్స్..

దేవుడు : అదేరా మీతో ప్రాబ్లం అసలైన విషయాలన్నీ వదిలేసి పనికిమాలిన విషయాల గురించి పాకులాడుతారు.. ఏరా మీకంత తెలివితేటలు ఇచ్చి టి.వి. తయారుచేయిస్తే..

ఆత్మ హత్యలు చేసుకుంటున్నఅన్నం పెట్టే రైతుల గురించి వదిలేసి..

అక్రమంగా పాలన సాగిస్తున్న నాయకుల గురించి వదిలేసి..

అన్నెం పున్నెం ఎరుగని పిల్లలకి కిలోల్లెక్క స్కూల్ బ్యాగ్ తగిలించి వాళ్ళు ఏడ్చి ఏడ్చి ఆత్మ హత్యలు చేసుకుంటుంటే అది వదిలేసి.. 

బార్డర్ లో కొన్ని వేల మంది సైనికులు దేశం కోసం చస్తుంటే అది వదిలేసి..

తిండానికి అన్నం లేక ఎంతో మంది అనాధలు ఉంటే వాల్లని వదిలేసి..

లాంటి ముఖ్యమైన సమస్యలు వదిలేసి.. 

చెత్త చెదారాన్ని ప్రధాన సమస్యలని టి.విలో చూస్తూ వాటి గురించే డిస్కస్ చేసుకుంటూ పోస్ట్లు పెట్టుకుంటూ వచ్చే లైక్లు చూసి కడుపు నింపుకునే మిమ్మల్ని బాగు చేయాలంటే నా వల్ల కాదు గాని ఏ దేవుడి వల్ల కూడా కాదు దరిద్రుడా..అని మాయం అయిపొయాడు..

ఘోరం కి మాత్రం కోపం వచ్చి ఎఫ్.బి. లో ఇలా పొస్ట్ పెట్టాడు..

"దేవుడు అనేది వట్టి భూటకం.. అతను ఏమి చేయలేడు.. "

దాని మీద ఫుల్ల్ డిబేట్.. ఘోరం ఖుషి.... జై

 

(వాట్సాప్ షేర్ నుంచి)