Food

రాగుల ఇడ్లీ, దోశ, చపాతీని తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

రాగి రొట్టె

రాగులతో మీరు చపాతీని చేసుకుని కూడా తినొచ్చు. గోధుమ పిండికి బదులుగా రాగులతో చపాతీని చేసుకుని తింటే దానిలో ఉండే కాల్షియం మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Image credits: Getty

రాగి ఇడ్లీ

ఇడ్లీ రవ్వతో కాకుండా.. మీరు రాగులతో కూడా ఇడ్లీలను తయారుచేసుకుని తినొచ్చు. ఈ రాగి ఇడ్లీలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి ఎముకలను, కండరాలను హెల్తీగా ఉంచుతాయి. 

Image credits: social media

రాగి దోశ

 రెగ్యులర్ దోశలకు బదులుగా మీరు రాగుల పిండితో కూడా దోశలు చేసుకుని తినండి. దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. 

Image credits: Pinterest

రాగి లడ్డు

 రాగులతో లడ్డూలు కూడా చేయొచ్చు. ఈ లడ్డూల్లో ఫైబర్, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image credits: Getty

ఎముకల పెరుగుదల

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) చేసిన అధ్యయనం ప్రకారం.. రాగులు పిల్లలకు, వృద్ధులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి ఎముకల పెరుగుదలకు, బలానికి సహాయపడతాయి.

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

మీరు గనుక రాగులను ప్రతిరోజూ తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే మీ ఎముకలు విరగకుండా ఉంటాయి.

Image credits: Getty

రాగులు

రాగులను తీసుకోవడం వల్ల మీ శరీరంలో కాల్షియం సహజంగా పెరుగుతుంది. అయితే వ్యక్తిగత సలహా కోసం ఆరోగ్య నిపుణుడిని తప్పకుండా సంప్రదించండి.

Image credits: Getty

రోజుకు ఒక గుడ్డు తింటే ఏమౌతుందో తెలుసా

పురుషులు కచ్చితంగా తినాల్సిన ఆరు ఫుడ్స్ ఇవి

యాలకుల నీటిని రోజూ తాగితే ఏమౌతుంది?

మునగాకు రోజూ తింటే జరిగేది ఇదే