కడప: రాయలసీమ పర్యటనలో వున్న చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న సమావేశాలకు డబ్బులిచ్చిమరీ ప్రజలను రప్పించాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడిందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఆరోపించారు. స్వచ్చందంగా చంద్రబాబు మీటింగ్ లకు ప్రజలు వెళ్లడానికి ఇష్టపడటం లేదని... అందువల్లే డబ్బులు ఆశచూపిస్తున్నట్లు ఆరోపించారు. 

 టిడిపి అధినేత కడప జిల్లాలో పర్యటించడాన్ని రవీంద్రనాధ్ తప్పుబట్టాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి ఆరోగ్యం బాగలేకపోవడంతోనే చంద్రబాబు  గెలిచారని...లేదంటూ ఆయన ఓడిపోయేవాడని అన్నారు. 

గత ప్రభుత్వ పాలన పూర్తి అవినీతిమయంగా సాగిందని ఆరోపించారు. వేల హామీలిచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబు లక్షల కోట్లు దండుకున్నారని...ఈ క్రమంలో కేవలం డబ్బులు వచ్చే ప్రాంతంలో మాత్రమే శంకుస్థాపనలు చేశారని ఆరోపించారు. 

read more  ''జగన్ ది ''కంత్రి''వర్గం... ముందు బూతు మీడియం తర్వాతే ఇంగ్లీష్ మీడియం''

టిడిపి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయేనాటికి 65 వేల కోట్లు అప్పు మిగిల్చిందన్నారు. వీటన్నింటిన గమనించే చంద్రబాబును తిరస్కరించిన ప్రజలు జగన్ కు పట్టం కట్టినట్లు తెలిపారు. 

అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతున్న జగన్ పై విమర్శలు చేసే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు అంతంటి అవినీతి పరుడు రాష్ట్రం, దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా లేరని రవీంద్రనాధ్ విమర్శించారు.

 టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ప్రజలు ఛీ కొట్టిన సిగ్గురాలేదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కూాడా ఘాటు వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతపై విరుచుకుపడ్డారు. అసలు ఏం చేశారని ఆయన కడప జిల్లాలో అడుగుపెట్టారని ప్రశ్నించారు. ప్రతి సారి కడప రౌడీలు, రాయలసీమ రౌడీలు, పులివెందుల పంచాయితీలు అంటూ రాయలసీమ ప్రజలను అవమానించిన చంద్రబాబు ఏమొహం పెట్టుకుని కడప జిల్లాలో అడుగుపెడతారని ప్రశ్నించారు.

read more  జగన్ కు పొంచివున్న ప్రమాదం... చంద్రబాబును విచారించాలి: వైసిపి ఎమ్మెల్యే డిమాండ్

రాయలసీమలో అడుగు పెట్టడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అసలు ఆయనను జిల్లాకు ఆహ్వానించడమే కాదు స్వాగతం పలికిన టీడీపీ నాయకులకు ముందు బుద్ది లేదన్నారు. ముందుగా కడప ప్రజలకు క్షమాపణ చెప్పాకే చంద్రబాబు కడపలో అడుగుపెట్టాలని హెచ్చరించారు. 

 కడపలో స్టీల్ ప్లంట్ రాకుండా అడ్డుకుంది చంద్రబాబేనని... వైఎస్ రాజశేఖరరెడ్డి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేటాయించిన ప్రదేశంలో నెమళ్లు నాట్యం చేస్తాయంటూ తప్పుడు రాతలు రాయించారని అన్నారు. కేసీఆర్ తరిమేస్తే చంద్రబాబు అమరావతికి భయపడి పారిపోయి వచ్చారన్నారు. ఇప్పుడు అధికారులను భయపెట్టే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.