అమరావతి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని ప్రజలు ఛీ కొట్టిన సిగ్గురాలేదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో ప్రతిపక్ష నేతపై విరుచుకుపడ్డారు. అసలు ఏం చేశారని ఆయన కడప జిల్లాలో అడుగుపెట్టారని ప్రశ్నించారు. ప్రతి సారి కడప రౌడీలు, రాయలసీమ రౌడీలు, పులివెందుల పంచాయితీలు అంటూ రాయలసీమ ప్రజలను అవమానించిన చంద్రబాబు ఏమొహం పెట్టుకుని కడప జిల్లాలో అడుగుపెడతారని ప్రశ్నించారు.

రాయలసీమలో అడుగు పెట్టడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అసలు ఆయనను జిల్లాకు ఆహ్వానించడమే కాదు స్వాగతం పలికిన టీడీపీ  నాయకులకు ముందు బుద్ది లేదన్నారు. ముందుగా కడప ప్రజలకు క్షమాపణ చెప్పాకే చంద్రబాబు కడపలో అడుగుపెట్టాలని హెచ్చరించారు. 

ఇప్పుడు చంద్రబాబు సిగ్గులేకుండా జమిలీ ఎన్నికలు వస్తాయని మాయ మాటలు చెపుతున్నాడని అన్నారు. అదే జరిగి మళ్ళీ ఎన్నికలు వస్తే చంద్రబాబుకు ఒక సీటు కూడా రాదని అన్నారు.

read more  చంద్రబాబుకు మానసిక సమస్యలు... సింగపూర్ లో చికిత్స: మంత్రి అనిల్

మాతో పెట్టుకుంటే మాటాష్ అయిపోతారని చంద్రబాబు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఇలాగే మాతో పెట్టుకుంటే మాటాష్ అయిపోతారని మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని హెచ్చరించారని... ఆయన నిజంగానే ప్రమాదంలో చనిపోయారని తెలిపారు. కాబట్టి చంద్రబాబు మాటాష్ అంటూ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని కోరారు. 

కోర్టుల నుంచి 26 స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు తనను ఎవరూ ఏమీ చేయలేరని ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై అన్ని వాస్తవాలు బైటకు వస్తాయని  వెల్లడించారు.

వైస్సార్సీపీ ఎమ్మెల్యేలను పట్టుకొని ఆంబోతు అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు... నిజానికి వ్యవస్థలను నాశనం చేసిన చంద్రబాబే ఆంబోతులా వ్యవహారిస్తున్నారన్నారు. సీఎం జగన్ లక్షలాది ఉద్యోగాలు ఇస్తే చంద్రబాబు తీసేస్తున్నామంటే అబద్దాలను ప్రచారం చేస్తున్నారని... ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు దీనిపై యూ టర్న్ తీసుకున్నారని అన్నారు. 

read more  ''జగన్ ది ''కంత్రి''వర్గం... ముందు బూతు మీడియం తర్వాతే ఇంగ్లీష్ మీడియం''

గతంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసింది చంద్రబాబేనని గుర్తుచేశారు. ఇప్పుడుమాత్రం మోడీకి భయపడి పిల్లిలా నోరు మెదపడం లేదన్నారు. కేవలం ఆయనే  కాదు బావమరిది బాలకృష్ణతో కూడా మోడీని నోటికొచ్చినట్లుగా తిట్టించిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. ప్రస్తుత బిజెపి అధినేత అమిత్ షాపై తిరుపతిలో రాళ్ళ దాడి చేయించింది చంద్రబాబేనని ఆరోపించారు. 

చంద్రబాబు దత్తపుత్రుడు( జనసేన చీఫ్ పవన్ కల్యాణ్) ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదని... చంద్రబాబు కనుసన్నల్లోనే ఆయన నడుస్తున్నారని ఆరోపించారు. కడపలో స్టీల్ ప్లంట్ రాకుండా అడ్డుకుంది చంద్రబాబేనని... వైఎస్ రాజశేఖరరెడ్డి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేటాయించిన ప్రదేశంలో నెమళ్లు నాట్యం చేస్తాయంటూ తప్పుడు రాతలు రాయించారని అన్నారు.

 కేసీఆర్ తరిమేస్తే చంద్రబాబు అమరావతికి భయపడి పారిపోయి వచ్చారన్నారు. ఇప్పుడు అధికారులను భయపెట్టే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.