కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం చింతమాన్ పల్లెలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో నాగేశ్వర రెడ్డి అనే వ్యక్తి రెండేళ్ల కుమారుడి గొంతు కోసి హత్య చేశాడు. 

నాగేశ్వరెడ్డి సరిత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి వివాహమై ఏడు సంవత్సరాలు కాగా పెద్ద కుమారుడి వయస్సు ఐదు సంవత్సరాలు. రెండో కుమారుడు సందీప్ రెడ్డి వయసు రెండు సంవత్సరాలు.

గత కొద్దిరోజులుగా రెండో కుమారుడు తనకు పుట్టలేదంటూ నిత్యం భార్యతో గొడవ పడేవాడు. రోజురోజుకూ అనుమానం బలపడటంతో ఈ రోజు తెల్లవారుజామున నిద్రపోతున్న కుమారుడి గొంతు కోసి దారుణ హత్యకు పాల్పడ్డాడు.నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు