మహబూబ్‌నగర్ జిల్లాలో రైలింజిన్ పట్టాలు తప్పింది. మన్యంకొండ సమీపంలో ఓ ట్రాక్ మిషన్ పట్టాలు తప్పడంతో హైదరాబాద్-మహబూబ్‌నగర్‌ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లోనే పలు రైళ్లు నిలిచిపోయాయి. రాకపోకలు స్థంభించడంతో ప్రయాణికులు సుమారు 4 గంటలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో జనం పెద్ద సంఖ్యలో మహబూబ్‌నగర్ బస్టాండ్‌కు పోటెత్తారు.. అయితే అక్కడ బస్సులు లేకపోవడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు, సిబ్బంది ట్రాక్‌ మిషన్‌ను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.