Mahabubnagar  

(Search results - 49)
 • Telangana12, Oct 2019, 10:49 AM IST

  మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సమ్మె సెగ... అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు

  ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఫిట్మెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆయన అలా చెప్పగానే తమకు ఫిట్మెంట్ అవసరం లేదని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో మంత్రి కాస్త తగ్గి కార్మికుల సమస్యను ప్రజల దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.

 • TRAIN

  Districts9, Oct 2019, 8:31 PM IST

  మహబూబ్‌నగర్‌ జిల్లాలో పట్టాలు తప్పిన రైలింజిన్

  మహబూబ్‌నగర్ జిల్లాలో రైలింజిన్ పట్టాలు తప్పింది. మన్యంకొండ సమీపంలో ఓ ట్రాక్ మిషన్ పట్టాలు తప్పడంతో హైదరాబాద్-మహబూబ్‌నగర్‌ మార్గంలో రైళ్లు నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్‌లోనే పలు రైళ్లు నిలిచిపోయాయి

 • nursing girl raped

  Telangana10, Sep 2019, 7:29 AM IST

  ఇంటి దగ్గర దిగబెడతానని: 9 ఏళ్ల చిన్నారిపై యువకుడి అత్యాచారం

  మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక గ్రామంలో పెట్టిన వినాయక మండపం దగ్గరికి వెళ్లి దర్శనానంతరం తిరిగి ఇంటికి బయల్దేరింది. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఓ యువకుడు ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

 • Murder

  Telangana29, Aug 2019, 10:25 AM IST

  ప్రాణం తీసిన ఫేస్ బుక్ పరిచయం.. బండరాయితో మోది...

  నవీన్ రెడ్డి  జడ్చర్లకు వచ్చి హర్షిణికి మాయమాటలు చెప్పి సమీపంలో శంకరాయపల్లి తండాలోని నిర్మానుష్య ప్రాంతానికి కారులో తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో బండరాయితో కొట్టి హత్యచేశాడు. కాగా ఇంటి నుంచి బయటకు వెళ్లిన హర్షిణి తిరిగి ఇంటికి రాకపోవంతో కంగారు పడిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా సమాచారం దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 • prabahs

  ENTERTAINMENT28, Aug 2019, 7:15 PM IST

  'సాహో' థియేటర్ వద్ద విషాదం.. వ్యక్తి మృతి!

  ప్రభాస్ నటించిన సాహో చిత్రం అత్యంత భారీ అంచనాల నడుమ ఆగష్టు 30న విడుదల కాబోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం విడుదల కానుండడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. 

 • ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

  Telangana19, Aug 2019, 2:59 PM IST

  మళ్లీ వార్తల్లోకి కేఏపాల్... నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  కేఏపాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణ మిగితా నిందితులు న్యాయస్థానానికి హాజరైనప్పటికీ కేఏ పాల్ హాజరుకాలేదు. 

 • srinivas goud
  Video Icon

  Telangana15, Aug 2019, 11:28 AM IST

  మహాబూబ్‌నగర్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

  73వ, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను మంత్రి వివరించారు.

 • Srinivas Goud

  Telangana29, Jun 2019, 1:18 PM IST

  పాలమూరులో ఈకో పార్క్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (ఫోటోలు)

  పాలమూరులో ఈకో పార్క్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

 • మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలపై ఆ పార్టీ నేతలు కేసీఆర్‌కు ఓ నివేదికను అందించారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన డీకె అరుణ పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి బరిలో ఉన్నారు.

  Telangana25, May 2019, 4:36 PM IST

  నా ఓటమికి కారణమదే...: డికె అరుణ

  మహబూబ్ నగర్‌ లోక్ సభ  స్థానంపై బిజెపి జెండా ఎగరేయాలని డికె అరుణ విశ్వప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా ఆమె టీఆర్ఎస్ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్ రెడ్డి  చేతిలో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. అయితే తన ఓటమికి గల  కారణాలను విశ్లేషించుకున్న ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు. తాము అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే ఓట్లను అధికంగా సాధించామని...గ్రామీణ ప్రాంతాల్లో చాలా తక్కువ ఓట్లు వచ్చాయని తెలిపారు. కేవలం గ్రామీణ ప్రజలకు పార్టీని చేరువ చేయలేకపోవడం వల్లే తాను ఓడిపోవాల్సి వచ్చిందని అరుణ అభిప్రాయపడ్డారు. 

 • depression

  Telangana18, May 2019, 8:54 AM IST

  బర్రెను అమ్మారని గుండు గీశారు... అవమానంతో యువకుడు..

  గ్రామ సర్పంచి భర్త ఇచ్చిన తీర్పు... ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేలా చేసింది.  కాగా.. యువకుడు రాసిన ఆత్మహత్య లేఖ ప్రస్తుతం కలకలం రేపుతోంది. 

 • lady fire

  Telangana19, Apr 2019, 9:54 AM IST

  అక్రమ సంబంధం.. నిద్రిస్తున్న ప్రియురాలిపై పెట్రోల్ పోసి..

  వివాహేతర సంబంధం.. ఓ మహిళకు ప్రాణాల మీదకు తెచ్చింది. ఆరుబయట నిద్రిస్తున్న మహిళపై ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తే.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ప్రస్తుతం ఆమె తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన మహబూబ్ నగర్ లో చోటుచేసుకుంది.

 • chitharanjan das

  Telangana28, Mar 2019, 6:17 PM IST

  కాంగ్రెస్‌కు మరో షాక్... గులాబీ కండువా కప్పుకున్న మాజీ మంత్రి

  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వలసల పరంపర కొనసాగుతూనే వుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రారంభమైన ఈ వలసలు పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతున్నాయి. తాజాగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఓబిసి సెల్ మాజీ ఛైర్మన్ చిత్తరంజన్ దాస్ టీఆర్ఎస్ లో చేరారు. 

 • Telangana25, Mar 2019, 5:56 PM IST

  భారీ మెజారిటీయే హరీష్ ఉనికిని దెబ్బతీస్తోంది: రాంమాధవ్

  గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కంటే అల్లుడు హరీష్ రావు ఎక్కువ మెజారిటీతో గెలవడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు నచ్చనట్లుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. అందువల్లే హరీష్  ను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలా సిద్దిపేటలో సాధించిన లక్ష పైచిలుకు భారీ మెజారిటీయే హరీష్ ఉనికిని దెబ్బతీస్తోందని రాంమాధవ్ పేర్కొన్నారు. 

 • jithender reddy

  Telangana21, Mar 2019, 8:38 PM IST

  టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే... నా దగ్గర సమాధానం లేదు: జితేందర్ రెడ్డి

  లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంపై ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎంపీ స్పష్టం చేశారు

 • Kebab cylinder blast

  Telangana25, Jan 2019, 2:00 PM IST

  మహబూబ్ నగర్‌లో గ్యాస్ పేలుడు..ఐదుగురికి తీవ్ర గాయాలు

  మహబూబ్ నగర్ పట్టణం ఇవాళ తెల్లవారుజామున ప్రమాదం చోటుచేసుకుంది. ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలుడు దాటికి ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా ఈ పేలుడు దాటికి రోడ్డుపై నిలిపివున్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి.