Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు.... కానిస్టేబుల్ ఏం చేశాడంటే..

బీఎస్ మక్తాకు చెందిన ఉపాధ్యాయురాలు సుధారాణి(36) సోమవారం సాయంత్రం తన భర్తతో కలిసి బైక్ పై సికింద్రాబాద్ వైపు వెళుతోంది. కాగా.. సోమాజీ గూడ మోనప్ప చౌరస్తాలో వారి వాహనం  యూటర్న్ తీసుకుంటుండగా... వేగంగా వచ్చిన ఆటో వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న సుధారాణి కిందపడింది.

constable helps the woman who injured in road  accident
Author
Hyderabad, First Published Sep 24, 2019, 9:12 AM IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ పట్ల ఓ కానిస్టేబుల్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రమాదం జరిగిన వెంటనే నాకు ఎందుకులే అని వదిలేయకుండా... ఆ మహిళను తన చేతులతో మోస్తూ... హాస్పిటల్ కి తీసుకువచ్చాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  బీఎస్ మక్తాకు చెందిన ఉపాధ్యాయురాలు సుధారాణి(36) సోమవారం సాయంత్రం తన భర్తతో కలిసి బైక్ పై సికింద్రాబాద్ వైపు వెళుతోంది. కాగా.. సోమాజీ గూడ మోనప్ప చౌరస్తాలో వారి వాహనం  యూటర్న్ తీసుకుంటుండగా... వేగంగా వచ్చిన ఆటో వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న సుధారాణి కిందపడింది.

ఆమె తలకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. తలకు, నడుముకు గాయాలై లేవలేక బాధ పడుతుండగా, పంజాగుట్ట పెట్రోకార్‌-3లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ ప్రభు.. ఆమెను చేతులపై మోసుకువెళ్లాడు. రోడ్డు దాటి అటుగా వెళ్తున్న ఆటోను ఆపి ఆమెను అందులో కూర్చొబెట్టాడు. ఆమెను సమీపంలోని వివేకానంద ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్‌ ప్రభును వాహనదారులు, ప్రయాణికులు అభినందించారు.కాగా... ఆమె ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని వైద్యులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios