అవినీతి శాఖ అధికారుల వలలో మరో అధికారి చిక్కుకున్నాడు. ర్నూల్ నగర శివారులోని పంచలింగాల ఆర్టీఏ చెక్‌పోస్టులో  మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ ఎ.శివప్రసాద్‌ ఇంట్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా... ఈ దాడుల్లో భయటపడిన అతని ఆస్తుల విలువ చూసి అధికారులు కూడా షాకయ్యారు. 

డీఎస్పీ నాగభూషణం ఆధ్వర్యంలో కర్నూలు, తాడిపత్రి, హైద్రాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. శివప్రసారద్ వద్ద గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.10కోట్లు, బహిరంగ మార్కెట్లో రూ.60కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఆయన భార్య ఝాన్సీ లక్ష్మి పేరుతో పలు కంపెనీలున్నట్లు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు.

బెంగళూరులో పద్మావతి హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్, ఆక్సీ ట్రీ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఝాన్సీ లక్ష్మీ ఎండీ కాగా, హైదరాబాద్ లోని సిగ్నస్ ఎడ్యుకేషనల్ సొసైటీకి కార్యదర్శిగా కొనసాగుతున్నట్లు ఆధారాలు లభించాయి.

శివప్రసాద్ కు ఉగాండాలోని క్రేన్ అనే బ్యాంకులో 2 ఖాతాలున్నట్లు గుర్తించారు. అక్కడ ఏవైనా పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి ఉంటారని, ఆ లావాదేవీల కోసమే ఖాతాలు తెరచి ఉంటారని భావిస్తున్నారు. బెంగళూరులో జీప్లస్-7 ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇంకా నిర్మాణంలోని ఉన్న ఈ అపార్ట్ మెంటును తన భార్య పేరుపై 2017లో రూ.2.6కోట్లకు కొన్నారు. కుందనహళ్లిలో జీప్లస్-2 అపార్ట్ మెంటునూ 2017లో కొనుగోలు చేశారు. దస్తావేజులో దీని విలువ రూ.2.70కోట్లుగా గుర్తించారు.