ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ పేరు, లోగో మారబోతుందని గత 48 గంటలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆర్సీబీకి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్స్ ప్రొఫైల్ పిక్చర్స్ మాయమవడం, 'ఆర్సీబీ కొత్తశకం ఆరంభమవుతోంది.. ఈ వాలంటైన్స్ డే మీకు మరిచిపోలేని రోజు'అంటూ ఫ్రాంచైజీ అధికారికంగా ట్వీట్ చేయడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది.

అయితే... ఆ వార్తలన్నీ పటా పంచల్ అయిపోయాయి. పేరు ఏమీ మారలేదు. కానీ లోగో మాత్రం చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఎంతలా అంటే.. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా లోగో చూసి షాకయ్యాడు.

ఆర్సీబీ కొత్త లోగోలో.. తలపై కిరీటంతో ఉన్న సింహాం రాయల్ వంశానికి తిరుగొస్తున్నట్లు ఉంది. ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. ఈసారైనా గెలవకపోతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘‘ఈ కొత్తలోగో‌ మీ అభిమాన జట్టుకు మధురానుభూతిని ఇస్తుందనుకుంటున్నాం. కొత్త శకం.. కొత్త ఆర్బీబీ.. ఇది మా సరికొత్త లోగో’’ అని ఆర్‌సీబీ ట్వీట్ చేసింది.

Also Read భార్యతో శిఖర్ ధావన్ వాలంటైన్స్ డే... రొమాంటిక్ పిక్ షేర్ చేసి....

ఈ కొత్త లోగో చూసి కోహ్లీ షాకయ్యాడు. తాను థ్రిల్ అయ్యానంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ 2020 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ కోహ్లీ పేర్కొన్నాడు. 

 

లోగో విడుదలకు ముందు కూడా కోహ్లీ ట్వీట్ చేశాడు. 'పోస్ట్‌లు అదృశ్యమయ్యాయి. కెప్టెన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మీకు ఏమైనా సహాయం కావాలంటే నన్ను అడగండి' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. దీనికి ఆర్‌సీబీ కూడా స్పందించింది. 

‘కెప్టెన్ అంతా బాగుంది. ప్రతీ అద్భుత ఇన్నింగ్స్ కూడా సున్నాతో ప్రారంభమవుతుందంటూ ఆర్సీబీ బదులిచ్చింది. ఆర్‌సీబీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా స్పందించాడు. 'మా సోషల్ మీడియా ఖాతాలకు ఏం జరిగింది?. ఇది కేవలం వ్యూహాత్మక విరామం అని ఆశిస్తున్నా' అని రాసుకొచ్చాడు.