టీమిండియా క్రికెటర్ మొహమ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడంతో అతని భార్య హసీన్ జహాన్ స్పందించారు. న్యాయవ్యవస్థకు ధన్యవాదాలని.. ఏడాది కాలంగా న్యాయం కోసం వేచిచూస్తున్నానని.. ఎట్టకేలకు మంచి నిర్ణయం వెలువడిందని జహాన్ వ్యాఖ్యానించారు.

తనంత బలవంతుడు లేడన్నట్లుగా షమీ మితిమీరి ప్రవర్తిస్తాడని... తానో గొప్ప క్రికెటర్‌లా ఫీలవుతాడని ఎద్దేవా చేసింది. తాను పశ్చిమ బెంగాల్‌కు చెందిన దానిని కాకున్నా.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ కాకుండా వేరే ఎవరున్నా..తాను క్షేమంగా ఉండేదానిని కాదని ఆమె స్పష్టం చేశారు.

యూపీలో ఉన్నప్పుడు అమ్రోహ పోలీసులు తనను, తన కూతురిని వేధింపులకు గురిచేశారని.. దేవుని దయవల్ల అక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డామని జహాన్ వాపోయారు.

కాగా.. హసీన్ జహాన్ దాఖలు చేసిన గృహ హింస ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అలీపూర్ కోర్టు షమీతో పాటు అతని సోదరుడు హసీద్ అహ్మద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

15 రోజుల్లోగా న్యాయస్థానం ముందు హాజరుకావాలని.. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు 15 రోజులు గడువిచ్చింది. షమీ తనను వేధిస్తున్నాడని హసీన్ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగించింది. ఈ క్రమంలోనే భర్తతో పాటు అతని సోదరుడిపై ఐపీసీ సెక్షన్ 498 ఏ కింద హసీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

క్రికెటర్ షమీకి అరెస్ట్ వారెంట్... బీసీసీఐ వాదన ఇదే 

టీమిండియా బౌలర్ షమీ అరెస్టుకు రంగం సిద్దం... వారెంట్ జారీ

బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్న షమీ భార్య... ఫోటో షూట్ వీడియో

మళ్లీ చిక్కుల్లో మొహమ్మద్ షమీ... అరెస్ట్ వారెంట్ తప్పదా..?

టీం ఇండియా క్రికెటర్ షమీ భార్య అరెస్ట్

టీం ఇండియా క్రికెటర్ షమీకి అమెరికా షాక్

రాజకీయాల్లోకి క్రికెటర్ షమీ భార్య.. కాంగ్రెస్‌లో చేరిక

భావోద్వేగానికి లోనైన టీం ఇండియా పేసర్ షమీ

‘నేనేమి పిచ్చోడ్ని కాదు’

నిన్ను మిస్ అవుతున్నా.. క్రికెటర్ షమీ