ఇటీవల వివాదాలతో సతమతమవుతున్న టీం ఇండియాలో ఫేస బౌలర్ మహ్మద్ షమి తన కూతురిని చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రస్తుతం టీం ఇండియాలో చోటు కోల్పోడంతో పాటు భార్య పెట్టిన కేసులతో అతడు గత కొద్ది రోజులుగా అతడు సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ సమస్యలతో మానసికంగా కుంగిపోయిన మహ్మద్ షమీ తన కూతురితో వీడియో ‌కాల్‌లో మాట్లాడగానే భావోద్వేగానికి గురయ్యాడు.  

ఈ విషయాన్ని అతడే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. " నిన్ను మూడు నెలల తర్వాత చూసినందుకు ఆనందంగా ఉంది...ఐ లవ్‌ యూ మై హార్ట్‌ బీట్‌..’అంటూ ఉద్వేగానికి లోనైన షమీ తన కూతురితో వీడియో కాల్ మాట్లాడుతున్న ఫోటో అప్ లోడ్ చేశాడు. 

 భార్య హసీన్ జహాన్ గొడవల కారణంగా మహ్మద్ షమీ కి దూరంగా ఉంటోంది. ఈమెతో పాటు వీరి కూతురు కూడా షమీ కి దూరంగా ఉంటునన్న విషయం తెలిసిందే.అయితే ఇటీవల షమీకి రోడ్డు ప్రమాదం జరగ్గా అతన్ని పరామర్శించేందుకు భార్య హసీన్ కూతురితో కలిసి  హాస్పిటల్ కి వచ్చింది. అయితే షమీ మాత్రం భార్యతో మాట్లాడకుండా పాపతో మాత్రమే మాట్లాడినట్లు అప్పట్లో హసీన్ వెల్లడించింది. దీన్ని బట్టి షమీకి తన కూతురంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. తాజా పోస్టింగ్ తో మరో సారి కూతురిపై తనకున్న ప్రేమను షమీ చాటుకున్నాడు.