MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • IND vs ENG : మనోడి అరాచకం.. వాంఖడేలో భారత్ vs ఇంగ్లాండ్ అసలైన ఫైట్ !

IND vs ENG : మనోడి అరాచకం.. వాంఖడేలో భారత్ vs ఇంగ్లాండ్ అసలైన ఫైట్ !

India vs England : టీ20 ప్రపంచకప్ 2026లో మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ సమరం జరగనుంది. అయితే, ఈ గ్రౌండ్ లో భారత్ రికార్డులు ఎలా ఉన్నాయి? గెలుపు ఎవరిది?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 03 2026, 08:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ముంబై అడ్డాపై టీమిండియా రికార్డులు చూస్తే మైండ్ బ్లాకే!
Image Credit : ANI

ముంబై అడ్డాపై టీమిండియా రికార్డులు చూస్తే మైండ్ బ్లాకే!

ముంబైలోని వాంఖడే స్టేడియం మరో హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా మార్చి 5న భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండో సెమీఫైనల్లో తలపడనున్నాయి. వరుసగా మూడోసారి ప్రపంచకప్ సెమీఫైనల్లో ఈ రెండు జట్లు తలపడుతుండటం విశేషం. గత చరిత్రను పరిశీలిస్తే, ఈ సెమీఫైనల్లో గెలిచిన జట్టునే టోర్నీ విజేతగా నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

26
IND vs ENG హ్యాట్రిక్ సెమీఫైనల్ పోరు
Image Credit : Getty

IND vs ENG హ్యాట్రిక్ సెమీఫైనల్ పోరు

2022 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ భారత బౌలర్లపై విరుచుకుపడి లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు. ఆ ఓటమికి భారత్ 2024లో ప్రతీకారం తీర్చుకుంది. స్లో పిచ్‌పై ఇంగ్లాండ్‌ను కట్టడి చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రస్తుతం ఈ ఎడిషన్‌లో రెండు జట్లు తలో ఒక్క మ్యాచ్‌లో ఓటమిని చవిచూశాయి. సూపర్ 8లో అజేయంగా నిలిచిన ఇంగ్లాండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. విల్ జాక్స్, హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

Related Articles

Related image1
T20 World Cup 2026 సెమీ ఫైనల్: మ్యాచ్ వర్షంతో రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు?
Related image2
IND vs ENG: ఫైనల్ చేరాలంటే ఈ మార్పులు తప్పవు.. టీమిండియా నయా ఆర్మీ ఇదే !
36
IND vs ENG : అభిషేక్ శర్మ అద్భుత రికార్డు
Image Credit : ANI

IND vs ENG : అభిషేక్ శర్మ అద్భుత రికార్డు

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు వాంఖడే స్టేడియంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఫిబ్రవరి 2025లో ఇంగ్లాండ్‌తో ఇక్కడే జరిగిన టీ20 మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 60 బంతుల్లోనే 135 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ సాయంతో భారత్ 247 పరుగుల భారీ స్కోరు సాధించింది. వాంఖడేలో ఒక భారతీయుడికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. అలాగే ఇక్కడ అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయుడిగా కూడా అభిషేక్ రికార్డు సృష్టించాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న అతను, తనకు అచ్చొచ్చిన మైదానంలో మళ్లీ పుంజుకుంటాడని జట్టు ఆశిస్తోంది.

46
ముంబై ఇండియన్స్ హోమ్ అడ్వాంటేజ్
Image Credit : X/bcci

ముంబై ఇండియన్స్ హోమ్ అడ్వాంటేజ్

ముంబై ఇండియన్స్‌కు హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడేలో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లకు అపారమైన అనుభవం ఉంది. ఇక్కడి పరిస్థితులు, పిచ్ స్వభావం వారికి బాగా తెలుసు. ముంబై ఆటగాడు శివం దూబే, మాజీ ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్ కూడా ఇక్కడ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఈ ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను అమెరికాతో ఇక్కడే ఆడింది. ఆ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్నప్పటికీ, సూర్యకుమార్ యాదవ్ అర్ధసెంచరీతో జట్టును గెలిపించాడు.

56
వాంఖడేలో భారత్ టీ20 రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Image Credit : x@bcci

వాంఖడేలో భారత్ టీ20 రికార్డులు ఎలా ఉన్నాయంటే?

వాంఖడే స్టేడియంలో భారత్ ఇప్పటివరకు 7 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడింది. అందులో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, రెండింటిలో ఓడిపోయింది. ఇక్కడ భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ 197 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. 2017 డిసెంబర్ తర్వాత ఇక్కడ భారత్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం. అమెరికాపై సాధించిన 161 పరుగులు ఇక్కడ భారత్ నమోదు చేసిన అత్యల్ప స్కోరు కాగా, ఇంగ్లాండ్‌పై చేసిన 247 పరుగులు అత్యధిక స్కోరు.

66
IND vs ENG మార్చి 5న అసలైన సమరం
Image Credit : X/ICC

IND vs ENG మార్చి 5న అసలైన సమరం

ప్రస్తుత టైటిల్ డిఫెండర్‌గా ఉన్న భారత్, మరోసారి ఫైనల్ చేరాలని పట్టుదలతో ఉంది. వాంఖడే పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది, కానీ సాయంత్రం వేళ మంచు కురిసే అవకాశం ఉండటంతో టాస్ కీలకం కానుంది. ఫాస్ట్ బౌలర్లకు ఆరంభంలో స్వింగ్ లభించే అవకాశం ఉంది. బుమ్రా, హార్దిక్ పాండ్యా ఇక్కడ ఎలా బౌలింగ్ చేస్తారనేది మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది. మార్చి 5న సాయంత్రం 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
క్రీడలు
భారత దేశం
క్రికెట్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: ఫైనల్ చేరాలంటే ఈ మార్పులు తప్పవు.. టీమిండియా నయా ఆర్మీ ఇదే !
Recommended image2
T20 World Cup 2026 సెమీ ఫైనల్: మ్యాచ్ వర్షంతో రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు?
Recommended image3
Sanju Samson: టీమిండియాకు బిగ్ షాక్.. సంజూ శాంసన్ పై బ్యాన్? ‎
Related Stories
Recommended image1
T20 World Cup 2026 సెమీ ఫైనల్: మ్యాచ్ వర్షంతో రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు?
Recommended image2
IND vs ENG: ఫైనల్ చేరాలంటే ఈ మార్పులు తప్పవు.. టీమిండియా నయా ఆర్మీ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved