టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఆమె హస్తం తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ సమక్షంలో హసీన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

కొద్దిరోజుల క్రితం షమీపైనా, తల్లి, సోదురుడిపై గృహహింస ఆరోపణలు చేసిన జహాన్ వారిపై పలు సెక్షన్ల కింద కేసులు కూడా పెట్టారు. షమీతో పాటు అతని కుటుంబసభ్యులు తనను కొట్టారని, అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు.. అసభ్యంగా ప్రవర్తించారని హాసీన్ ఆరోపించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

దీనితో పాటు షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు సైతం పాల్పడ్డారని ఆమె ఆరోపణలు చేయడం క్రికెట్ వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. హసీన్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి షమీని విచారించారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంట్రాక్ట్ జాబితా నుంచి షమీని తొలుత తొలగించింది. అనంతరం తిరిగి జట్టులోకి తీసుకుంది.