టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీపై సంచలన ఆరోపణలు చేసి, పలు కేసులు పెట్టిన ఆయన భార్య హసీన్ జహాన్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. ఐపీఎల్ చీర్ గర్ల్ అయిన హసీన్... మాజీ మోడల్ కూడా. అంజాద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఫత్వా' సినిమాలో ఆమె నటించనుంది. అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో ఓ జర్నలిస్టుగా హసీన్ నటించబోతోంది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన కూతురుని పోషించడానికి కొంత సంపాదించాలన్న ఉద్దేశంతోనే సినిమాల్లో నటించాలనుకుంటున్నానని తెలిపింది. ఈ కారణంగా అంజాద్ ఖాన్ ను కలిసి... సినిమా చేయడానికి ఒప్పుకున్నానని చెప్పారు. అయితే, షమీ నుంచి న్యాయబద్ధంగా తనకు రావాల్సిన భరణం గురించి పోరాడతానని తెలిపింది. ఈ చిత్రం కోసం నిర్వహించిన ఫొటో షూట్ ను కూడా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది.