Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ చిక్కుల్లో మొహమ్మద్ షమీ... అరెస్ట్ వారెంట్ తప్పదా..?

టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ మరోసారి చిక్కుల్లో ఎదుర్కొన్నాడు.. తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో భర్తపై కేసు పెట్టింది. దీనిపై జనవరి 15 లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కోల్‌కతా కోర్టు నోటీసులు జారీ చేసింది

court summons to team india cricketer mohammed shami
Author
Kolkata, First Published Nov 15, 2018, 8:09 AM IST

టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ మరోసారి చిక్కుల్లో ఎదుర్కొన్నాడు.. తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో భర్తపై కేసు పెట్టింది. దీనిపై జనవరి 15 లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కోల్‌కతా కోర్టు నోటీసులు జారీ చేసింది.

షమీ అతని భార్య హసీన్ మధ్య కొద్దికాలం కింద మనస్పర్థలు రావడం.. తన భర్తకు చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని.. అతనిపై గృహ హింస కేసు పెట్టడంతో వీరి బంధం బీటలు వారింది. వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోనున్నారు.. గొడవల కారణంగా ఇద్దరూ విడిగా ఉంటున్నారు.

అయితే హసీన్ వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం షమీ ప్రతినెల చెక్కు పంపిస్తున్నాడు. అయితే ఈ మధ్య ఇచ్చిన చెక్కు డ్రా అవ్వకుండా షమీ కావాలనే ఆపాడని హసీన్ ఎన్ఐ చట్టం కింద కోల్‌కతాలోని అలిపోర్ కోర్టులో కేసు వేసింది.

దీనిపై విచారణకు హాజరుకావాల్సిందిగా షమీకి న్యాయస్థానం నోటీసులు పంపింది.. అయినప్పటికి అతను స్పందించలేదు. దీంతో బుధవారం జరిగిన విచారణకు రావాల్సిందిగా అక్టోబర్‌లో మరోసారి కోర్టు నోటీసులు జారీ చేసింది.. దీనికి షమీ హాజరుకాలేదు..

దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి జనవరి 15న ప్రత్యక్షంగా విచారణకు హాజరుకాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించారు. దీంతో షమీ తరపున షమీ తరపున హాజరయ్యేందుకు తనకు అనుమతి ఇవ్వాలని అతడి లాయర్ ఎస్కే సలీమ్ రెహమన్ న్యాయమూర్తిని కోరారు. 

రాజకీయాల్లోకి క్రికెటర్ షమీ భార్య.. కాంగ్రెస్‌లో చేరిక

భావోద్వేగానికి లోనైన టీం ఇండియా పేసర్ షమీ

‘నేనేమి పిచ్చోడ్ని కాదు’

నిన్ను మిస్ అవుతున్నా.. క్రికెటర్ షమీ

 

Follow Us:
Download App:
  • android
  • ios