టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. గతకొంత కాలంగా షమీకి అతడి భార్య హసీన్ జహాన్ మధ్య వివాదం కొనసాగుతోంది. భర్తకు దూరంగా వుంటున్న హసీస్ షమీతో పాటు వారి కుటుంబ సభ్యులపై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. దీనిపై విచారణ జరుపుతున్న అలిపోర్ కోర్టు షమీతో పాటు అతడి సోదరుడు హసిద్ అహ్మద్ లను అరెస్ట్ చేయాల్సిందిగా అదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 

భార్యను హింసించినందుకు షమీని, సహకరించినందుకు అతడి తమ్మున్ని అరెస్ట్ చేయాల్సిందిగా కోర్టు స్థానికి పోలీసులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. 15రోజుల్లోగా వారిద్దరిని అరెస్ట్ చేసి తమముందు హాజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. 

షమీ అతని భార్య హసీన్ మధ్య కొద్దికాలం కింద మనస్పర్థలు రావడం విడిపోయారు. దీంతో తాము కలిసున్న సమయంలో షమీ, అతడి కుటుంబ సభ్యులు హింసించారని ఆరోపిస్తూ హసీన్ కేసు పెట్టింది. అంతేకాకుండా తన భర్త చాలా మంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని తనను మానసికంగాను హింసించాడని హసీస్ ఆరోపించారు. 

ఇలా విడిపోయిన భార్య హసీన్ వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం డబ్బులను షమీ ప్రతినెలా చెక్కు రూపంలొో పంపిస్తున్నాడు. అయితే ఈ చెక్కులు డ్రా అవ్వకుండా షమీ కావాలనే ఆపాడని హసీన్ ఎన్ఐ చట్టం కింద కోల్‌కతాలోని అలిపోర్ కోర్టులో కేసు వేసింది. దీంతో విచారణకు హాజరుకావాలంటూ న్యాయస్థానం నోటీసులు పంపించినా అతడు స్పందించలేదు. దీంతో గతంలోనే అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అప్పుడు ఎలాగోలా అరెస్ట్ నుండి షమీ తప్పించుకున్నాడు. 

కానీ మరోసారి అదేకోర్టు తాజాగా షమీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో వెస్టిండిస్ పర్యటన ముగిసిన అనంతరం స్వదేశానికి రానున్న షమీని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.  

సంబంధిత వార్తలు

బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్న షమీ భార్య... ఫోటో షూట్ వీడియో

మళ్లీ చిక్కుల్లో మొహమ్మద్ షమీ... అరెస్ట్ వారెంట్ తప్పదా..?

టీం ఇండియా క్రికెటర్ షమీ భార్య అరెస్ట్

టీం ఇండియా క్రికెటర్ షమీకి అమెరికా షాక్

రాజకీయాల్లోకి క్రికెటర్ షమీ భార్య.. కాంగ్రెస్‌లో చేరిక

భావోద్వేగానికి లోనైన టీం ఇండియా పేసర్ షమీ

‘నేనేమి పిచ్చోడ్ని కాదు’

నిన్ను మిస్ అవుతున్నా.. క్రికెటర్ షమీ