‘నేనేమి పిచ్చోడ్ని కాదు’

‘నేనేమి పిచ్చోడ్ని కాదు’

టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ షమీ.. తన భార్య హసీన్ జహాన్ కి కౌంటర్ ఇచ్చారు. గతంలో షమీ తనను హింసించాడంటూ మీడియా ముందుకు వచ్చిన హసీన్.. తాజాగా షమీ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ పలు వ్యాఖ్యలు చేసింది. కాగా..  ఈ వ్యాఖ్యలపై షమీ స్పందించారు.

'ఒక్క పెళ్లి చేసుకొనే నానా ఇబ్బందులు పడుతుంటే.. రెండో పెళ్లా? మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా'? అని షమీ బదులిచ్చాడు. టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగమైన షమీ మరి కొద్ది రోజుల్లో పర్యటనకు బయల్దేరనున్నాడు. ఇటీవల అతను ప్రాతినిథ్యం వహించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు ఐపీఎల్ 2018 అంతంత మాత్రంగానే రాణించింది. ఇవన్నీ కుటుంబంలో వివాదాల కారణంగానే సరిగ్గా ఆడలేకపోయానంటూ.. ఇంగ్లాండ్ పర్యటనలో చక్కటి ప్రదర్శన ఇస్తానంటూ షమీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

'హసీన్ గత కొద్ది నెలలుగా నాపై బోలెడన్ని విమర్శలు చేసింది. నేను పెళ్లి చేసుకోబోతున్నాను అనేది కూడా అందులో ఒకటి. నా రెండో పెళ్లికి తనను ఆహ్వానిస్తా'నంటూ షమీ వ్యంగ్యంగా మాట్లాడాడు. రంజాన్ తర్వాత అతడు మరో పెళ్లి చేసుకోబోతున్నాడని ఆరోపించిన ఆమె మాట కూడా అవాస్తవమేనంటూ కొట్టి పడేశాడు షమీ. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM SPORTS

Next page