టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి అమెరికా రాయబార కార్యాలయం షాక్ ఇచ్చింది. ఆయనకు అమెరికా వీసా ఇవ్వడానికి నిరాకరించింది. షమీపై పలు కేసులో విచారణలో ఉన్న నేపథ్యంలో ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించడం గమనార్హం.

గతేడాది షమీపై ఆయన భార్య హసీన్ జహాన్ గృహ హింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా... హాసిన్ జహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోల్ కతా పోలీసులు షమీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో షమీపై కేసులు విచారణలో ఉన్నాయి.

ఈ క్రమంలోనే షమీ యూఎస్ వీసా నిరాకరించారు. కాగా... భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జోహ్రీ ఈ విషయంపై స్పందించారు. ఈ విషయంలో అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాశారు. భారత క్రికెటర్ అయిన షమీ ప్రపంచకప్ తోపాటు పలు క్రికెట్ టోర్నీల్లో పాల్గొని విజయాలు సాధించాడని.. అతనికి పీ వన్ కేటగిరి కింద అంతర్జాతీయ క్రీడాకారుడిగా గుర్తించి వీసా జారీ చేయాలని బీసీసీఐ సీఈవో కోరారు. ఆయన అభ్యర్థన మేరకు షమీకి వీసా జారీ చేసినట్లు తెలుస్తోంది.