టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీకి కాస్త ఊరట లభించింది. గృహహింస కేసులో అతన్ని అరెస్ట్ చేయాలన్ని అలీపోర్ కోర్టే తాజాగా తమ ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి తాము ఆదేశించే వరకు అతన్ని అరెస్ట్ చేయకూడదంటూ కోర్టు పశ్చిమ బెంగాల్ పోలీసులను ఆదేశించింది. దీంతో షమీ వెస్టిండిస్ పర్యటన నుండి నిశ్చింతంగా స్వదేశానికి చేరుకోనున్నాడు. 

అలీపోర్ కోర్టు షమీ అరెస్ట్ పై స్టే విధించినట్లు ఆయన న్యాయవాది సలీం రెహ్మాన్ కూడా దృవపర్చారు. తమ వాదనను విన్న న్యాయస్థానం తదుపరి విచారణ జరిగే నవంబర్ 2వ తేదీ వరకు అరెస్ట్ పై స్టే విధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు బెంగాల్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు సలీం తెలిపారు. 

వెస్టిండిస్ పర్యటన ముగిసిన వెంటనే షమీ యూఎస్‌ఎ కు వెళ్లిపోయాడు. అక్కడినుండి ఈ  నెల 12వ తేదీన స్వదేశానికి పయనమవ్వాల్సి వుంది. ఈ నేపథ్యంలో అమెరికా నుండే అతడు ముందస్తు బెయిల్  కోసం ప్రయత్నించాడు.   అక్కడినుండే తన లాయర్ సలీమ్ రహ్మాన్ తో టచ్ లో వున్నాడు. ఇలా ఎట్టకేలకు స్వదేశానికి రాకముందే తనపై వెలువడిన అరెస్ట్ వారెంట్ పై కోర్టునుండే స్టే పొందాడు.   

గతకొంత కాలంగా షమీకి అతడి భార్య హసీన్ జహాన్ మధ్య వివాదం కొనసాగుతోంది. భర్తకు దూరంగా వుంటున్న హసీస్ షమీతో పాటు వారి కుటుంబ సభ్యులపై గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. దీనిపై విచారణ జరుపుతున్న అలిపోర్ కోర్టు షమీతో పాటు అతడి సోదరుడు హసిద్ అహ్మద్ లను అరెస్ట్ చేయాల్సిందిగా అదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.   ఇందుకు సంబంధించి అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. 15రోజుల్లోగా వారిద్దరిని అరెస్ట్ చేసి తమముందు హాజరుపర్చాలని గతంలో న్యాయమూర్తి ఆదేశించారు. 

గతేడాది మార్చిలో  తన భర్త షమీతో పాటు అతడి కుటుంబసభ్యులపై హసీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గృహహింస చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో విచారణకు హాజరుకావాలంటూ న్యాయస్థానం పలుమార్లు నోటీసులు పంపించినా షమీ స్పందించలేదు. దీంతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 

సంబంధిత వార్తలు

క్రికెటర్ షమీకి అరెస్ట్ వారెంట్... బీసీసీఐ వాదన ఇదే

టీమిండియా బౌలర్ షమీ అరెస్టుకు రంగం సిద్దం... వారెంట్ జారీ

బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్న షమీ భార్య... ఫోటో షూట్ వీడియో

మళ్లీ చిక్కుల్లో మొహమ్మద్ షమీ... అరెస్ట్ వారెంట్ తప్పదా..?

టీం ఇండియా క్రికెటర్ షమీ భార్య అరెస్ట్

టీం ఇండియా క్రికెటర్ షమీకి అమెరికా షాక్

రాజకీయాల్లోకి క్రికెటర్ షమీ భార్య.. కాంగ్రెస్‌లో చేరిక

భావోద్వేగానికి లోనైన టీం ఇండియా పేసర్ షమీ

‘నేనేమి పిచ్చోడ్ని కాదు’

నిన్ను మిస్ అవుతున్నా.. క్రికెటర్ షమీ