MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • T20 World Cup 2026 : ఫైనల్ చేరే ఆ రెండు జట్లు ఇవే.. టీమిండియా సంగతేంటి?

T20 World Cup 2026 : ఫైనల్ చేరే ఆ రెండు జట్లు ఇవే.. టీమిండియా సంగతేంటి?

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనలిస్టులపై దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఆసక్తికర జోస్యం చెప్పారు. ఇదే సమయంలో భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్‌ పై ఉత్కంఠ నెలకొంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 04 2026, 04:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టీ20 ప్రపంచకప్ 2026 ఉత్కంఠ.. ఫైనల్ చేరే జట్లు ఏవి?
Image Credit : ANI

టీ20 ప్రపంచకప్ 2026 ఉత్కంఠ.. ఫైనల్ చేరే జట్లు ఏవి?

టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన చివరి దశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల కళ్లన్నీ ఇప్పుడు సెమీఫైనల్ పోరుపైనే ఉన్నాయి. మార్చి 4, 5వ తేదీల్లో జరగనున్న ఈ కీలక సమరాల్లో ఏ రెండు జట్లు విజయం సాధించి ఫైనల్ మెట్లు ఎక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశంగా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సెమీఫైనల్ రేసులో నిలిచిన టీమ్స్ ఇవే
Image Credit : Getty

సెమీఫైనల్ రేసులో నిలిచిన టీమ్స్ ఇవే

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు భారత్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. టైటిల్ పోరుకు వారం రోజుల కంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో, జట్లన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మొదటి సెమీఫైనల్ పోరులో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక రెండో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, బలమైన ఇంగ్లాండ్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఈ నాలుగు జట్లు కూడా టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తూ ఇక్కడి వరకు వచ్చాయి.

36
ఫైనల్ చేరే జట్లపై మెక్‌గ్రాత్ జోస్యం
Image Credit : Getty

ఫైనల్ చేరే జట్లపై మెక్‌గ్రాత్ జోస్యం

గ్లెన్ మెక్‌గ్రాత్ తాజాగా ఒక మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైనలిస్టుల గురించి తన అంచనాలను పంచుకున్నారు. మెక్‌గ్రాత్ అభిప్రాయం ప్రకారం, ఈసారి ఫైనల్ మ్యాచ్ భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతుంది. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో కూడా ఇవే రెండు జట్లు తలపడిన విషయం తెలిసిందే. అప్పట్లో టీమ్ ఇండియా ఆఖరి నిమిషం వరకు పోరాడి విజయాన్ని అందుకుంది. మెక్‌గ్రాత్ అంచనా నిజమైతే, మరోసారి క్రికెట్ ప్రపంచం భారత్, సౌతాఫ్రికా మధ్య హైవోల్టేజ్ పోరును చూడనుంది.

46
టీమ్ ఇండియాకు రెడ్ అలర్ట్
Image Credit : X/ICC

టీమ్ ఇండియాకు రెడ్ అలర్ట్

మెక్‌గ్రాత్ తన విశ్లేషణలో టీమ్ ఇండియాను హెచ్చరించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరగనున్న సెమీఫైనల్ గురించి ఆయన మాట్లాడుతూ, "ఇంగ్లాండ్ అత్యంత ప్రమాదకరమైన జట్టు. వారు గనుక తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తే ఏ జట్టునైనా ఓడించగలరు" అని పేర్కొన్నారు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ ప్రయాణంలో కొంత అదృష్టం కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో దాదాపు ఓడిపోయే స్థితి నుంచి బయటపడ్డారని, ఇటలీతో జరిగిన మ్యాచ్ కూడా చాలా క్లోజ్‌గా సాగిందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కడం ఇంగ్లాండ్‌కు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డారు.

56
సౌతాఫ్రికా ఫామ్.. న్యూజిలాండ్ సవాలు
Image Credit : Getty

సౌతాఫ్రికా ఫామ్.. న్యూజిలాండ్ సవాలు

మరోవైపు సౌతాఫ్రికా జట్టు గురించి మెక్‌గ్రాత్ స్పందిస్తూ.. ప్రోటీస్ జట్టు ప్రస్తుతం అద్భుతమైన హిట్టర్లు, నాణ్యమైన బౌలింగ్ విభాగంతో బలంగా ఉందని అన్నారు. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో సౌతాఫ్రికాదే పైచేయి ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. "సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడినప్పుడు ఎప్పుడూ ఏదో ఒక విశేషం ఉంటుంది. అయితే చరిత్రను చూస్తే సౌతాఫ్రికా సులభంగా విజయం సాధిస్తుంది" అని మెక్‌గ్రాత్ పేర్కొన్నారు. టీ20 క్రికెట్‌పై సౌతాఫ్రికా ప్రత్యేక దృష్టి సారించడం వారికి కలిసొచ్చే అంశమని ఆయన అన్నారు.

66
భారత్ సెమీఫైనల్ వ్యూహం ఏంటి?
Image Credit : Getty

భారత్ సెమీఫైనల్ వ్యూహం ఏంటి?

టీమ్ ఇండియా ఈ టోర్నీ ఆరంభం నుండి ఓటమి ఎరుగకుండా దూసుకుపోతోంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు కలిసికట్టుగా రాణిస్తోంది. అయితే సెమీఫైనల్ వంటి నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్ వంటి జట్లను తక్కువ అంచనా వేయకూడదని మెక్‌గ్రాత్ హెచ్చరికను టీమ్ ఇండియా సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ తన జోరును కొనసాగిస్తే ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు. అభిమానులు కూడా మరోసారి భారత్ విశ్వవిజేతగా చూడాలని కోరుకుంటున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Related Stories
Recommended image1
IND vs ENG: ఫైనల్ చేరాలంటే ఈ మార్పులు తప్పవు.. టీమిండియా నయా ఆర్మీ ఇదే !
Recommended image2
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved