MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Bumrah : ఒక్క వికెట్ పడితే.. బుమ్రా సంచలనం !

Bumrah : ఒక్క వికెట్ పడితే.. బుమ్రా సంచలనం !

Jasprit Bumrah : టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌తో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ లో మరో ఒక్క వికెట్‌తో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 500 అంతర్జాతీయ వికెట్ల క్లబ్‌లో చేరుతాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 04 2026, 08:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బుమ్రా సంచలనం.. ప్రపంచ క్రికెట్‌లో అరుదైన రికార్డు
Image Credit : ANI

బుమ్రా సంచలనం.. ప్రపంచ క్రికెట్‌లో అరుదైన రికార్డు

టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. మార్చి 5వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ పోరు జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక భారీ మైలురాయిని అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్ల క్లబ్‌లో చేరడానికి బుమ్రాకు కేవలం ఒకే ఒక్క వికెట్ అవసరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
500 వికెట్ల క్లబ్‌లో ఎనిమిదో భారతీయుడిగా బుమ్రా
Image Credit : Getty

500 వికెట్ల క్లబ్‌లో ఎనిమిదో భారతీయుడిగా బుమ్రా

ప్రస్తుతం బుమ్రా తన ఖాతాలో 499 అంతర్జాతీయ వికెట్లను కలిగి ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై ఒక వికెట్ తీస్తే, ఈ ఘనత సాధించిన ఎనిమిదో భారత బౌలర్‌గా రికార్డు సాధిస్తాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (953), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687), రవీంద్ర జడేజా (634), జహీర్ ఖాన్ (597), జవగల్ శ్రీనాథ్ (551) మాత్రమే ఉన్నారు. బుమ్రా ఈ మైలురాయిని చేరుకుంటే, శ్రీనాథ్, జహీర్, కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారతీయ ఫాస్ట్ బౌలర్‌గా నిలుస్తాడు.

36
ఇంగ్లాండ్‌పై బుమ్రా అద్భుత రికార్డు
Image Credit : AFP

ఇంగ్లాండ్‌పై బుమ్రా అద్భుత రికార్డు

ఇంగ్లాండ్ బ్యాటర్లకు బుమ్రా ఎప్పుడూ ఒక సింహస్వప్నమే. టీ20 ఫార్మాట్‌లో ఇంగ్లాండ్‌తో ఆడిన 5 మ్యాచుల్లో బుమ్రా 9 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి ఇంగ్లాండ్‌పై 29 మ్యాచులు ఆడిన బుమ్రా, సరిగ్గా 100 వికెట్లు తీసి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో కూడా బుమ్రా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆరు మ్యాచుల్లో 9 వికెట్లు తీసి టీమ్ ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి జట్లపై తన బౌలింగ్‌తో బ్యాటర్లను వణికించాడు.

46
బుమ్రా పదేళ్ల ప్రస్థానం.. తిరుగులేని ప్రదర్శన
Image Credit : AFP

బుమ్రా పదేళ్ల ప్రస్థానం.. తిరుగులేని ప్రదర్శన

2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన బుమ్రా, గత పదేళ్లుగా టీమ్ ఇండియా ప్రధాన మ్యాచ్ విన్నర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 234 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన బుమ్రా 20.60 సగటుతో, 3.72 ఎకానమీతో 499 వికెట్లు సాధించాడు. ఇందులో 18 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం.

• టెస్ట్ క్రికెట్: 52 మ్యాచుల్లో 234 వికెట్లు.

• వన్డే క్రికెట్: 89 మ్యాచుల్లో 149 వికెట్లు.

• టీ20 క్రికెట్: 93 మ్యాచుల్లో 116 వికెట్లు.

56
ప్రపంచకప్ చరిత్రలో మరో రికార్డు దిశగా బుమ్రా
Image Credit : AFP

ప్రపంచకప్ చరిత్రలో మరో రికార్డు దిశగా బుమ్రా

టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో కూడా బుమ్రా అగ్రస్థానానికి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 24 మ్యాచుల్లో 35 వికెట్లతో ఉన్న బుమ్రా, ఇంగ్లాండ్‌పై మరో 4 వికెట్లు తీస్తే అన్రిచ్ నోర్ట్జే (38 వికెట్లు), లసిత్ మలింగ (38 వికెట్లు) రికార్డులను అధిగమిస్తాడు. ప్రస్తుత టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ బుమ్రాను ఒక బ్రహ్మాస్త్రంలా వాడుకుంటున్నారు. క్లిష్ట సమయాల్లో వికెట్లు తీయడంలో బుమ్రాకు సాటి ఎవరూ లేరని మరోసారి నిరూపితమైంది.

66
విమర్శల నుంచి విశ్వవిజేత వరకు.. బుమ్రా ప్రయాణం
Image Credit : AFP

విమర్శల నుంచి విశ్వవిజేత వరకు.. బుమ్రా ప్రయాణం

బుమ్రా విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా అతను ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేడని చాలా మంది విమర్శించారు. ముఖ్యంగా 2023లో వెన్ను శస్త్రచికిత్స తర్వాత అతని కెరీర్ ముగిసిందని భావించారు. కానీ, బుమ్రా అద్భుతమైన రీతిలో రీఎంట్రీ ఇచ్చాడు. "నన్ను 6 నెలలు లేదా 8 నెలలు మాత్రమే ఆడతారని అన్నారు, కానీ నేను 10 ఏళ్లుగా ఆడుతున్నాను" అని బుమ్రా గతంలో గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఐదు ఐపీఎల్ టైటిల్స్, ఒక టీ20 ప్రపంచకప్ (2024) గెలిచిన బుమ్రా, ఇప్పుడు 2026లో మరో ప్రపంచకప్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Related Stories
Recommended image1
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Recommended image2
IND vs ENG : ఇంగ్లండ్ వజ్రాయుధం.. ఆ ఒక్కడిని అడ్డుకుంటే భారత్ ఫైనల్‌కు చేరినట్టే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved