MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Sanju Samson: సంజూ శాంసన్ దెబ్బకు ఐసీసీ షేక్

Sanju Samson: సంజూ శాంసన్ దెబ్బకు ఐసీసీ షేక్

ICC T20I Rankings : వెస్టిండీస్‌పై 97 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్‌తో భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చిన సంజూ శాంసన్, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను వెనక్కి నెట్టి దూసుకుపోతున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 04 2026, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సంజూ శాంసన్ దూకుడు
Image Credit : Getty

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సంజూ శాంసన్ దూకుడు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ పెను సంచలనం సృష్టించారు. వెస్టిండీస్‌తో జరిగిన సూపర్ 8 చావో రేవో పోరులో సంజూ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ అతని కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో సంజూ కేవలం మూడు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ, అతని 97 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. దీని ప్రతిఫలంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో శాంసన్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి, ప్రపంచంలోని టాప్ 40 బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. మెరుగైన స్థానాలు గమనిస్తే.. సూర్య కుమార్ 1 స్థానం పడిపోగా.. సంజూ మాత్రం ఏకంగా 25 స్థానాలు పైకి చేరాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అగ్రస్థానంలో అభిషేక్ శర్మ
Image Credit : ANI

అగ్రస్థానంలో అభిషేక్ శర్మ

ప్రస్తుత టీ20 ర్యాంకింగ్స్‌ను గమనిస్తే టీమ్ ఇండియా యువ ఆటగాళ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 877 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న అభిషేక్, ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా ఎదిగారు. అతని దరిదాపుల్లో కూడా మరే ఇతర బ్యాటర్ లేకపోవడం గమనార్హం. అయితే, టీ20 ప్రపంచ కప్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

34
టాప్ 10లో భారతీయుల ఆధిపత్యం
Image Credit : Getty

టాప్ 10లో భారతీయుల ఆధిపత్యం

టాప్ 10 టీ20 బ్యాటర్ల జాబితాలో నలుగురు భారతీయులు ఉండటం విశేషం. అభిషేక్ శర్మ (1వ ర్యాంక్), ఇషాన్ కిషన్ (5వ ర్యాంక్), సూర్యకుమార్ యాదవ్ (6వ ర్యాంక్), తిలక్ వర్మ (7వ ర్యాంక్) వరుసగా నిలిచారు. ఒకప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం 740 పాయింట్లతో ఆరో స్థానానికి పరిమితం కాగా, ఇషాన్ కిషన్ 742 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. తిలక్ వర్మ 730 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నారు.

44
ప్రపంచ స్థాయి ఆటగాళ్ల పరిస్థితి ఏమిటి?
Image Credit : Getty

ప్రపంచ స్థాయి ఆటగాళ్ల పరిస్థితి ఏమిటి?

భారత ఆటగాళ్లతో పాటు విదేశీ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లాండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ 815 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్‌జాదా ఫర్హాన్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 810 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నారు. శ్రీలంక బ్యాటర్ పాతుమ్ నిస్సంక 789 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. సౌతాఫ్రికా సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (9వ ర్యాంక్), న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ (10వ ర్యాంక్) కూడా టాప్-10లో చోటు దక్కించుకున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Recommended image2
Team India New Captain: టీమిండియాకు కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
స్మృతి మంధాన చేతికి టీమిండియా పగ్గాలు.. హర్మన్‌ప్రీత్ స్థానంలో కొత్త కెప్టెన్
Related Stories
Recommended image1
T20 World Cup 2026 : ఫైనల్ చేరే ఆ రెండు జట్లు ఇవే.. టీమిండియా సంగతేంటి?
Recommended image2
IND vs ENG : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ యుద్ధం.. భారత్ కు తలనొప్పిగా నలుగురు ప్లేయర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved