ప్రపంచ కప్ 2019 భారత జట్టును ప్రకటించినప్పటి నుండి ఇద్దరు ఆటగాళ్ల విషయంలో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసింది. టీమిండియాకు ప్రాతినిద్యం వహిస్తున్న ఏకైక తెలుగు ఆటగాడు అంబటి రాయుడు, డిల్లీ యువ కెరటం రిషబ్ పంత్ లను ప్రపంచ కప్ ఆడే ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కలేదు. వీరిని కాదని సెలెక్టర్లు ఆల్ రౌండర్ విజయ్ శంకర్, దినేశ్ కార్తిక్ లకు జట్టులో చోటు కల్పించారు. ఈ ఎంపికపై వివరణ ఇస్తూ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విజయ్ 3 డైమెన్షన్ ప్లేయర్ కావవడం వల్లే  అతన్ని ఎంపిక చేసినట్లు తెలిపాడు. అయితే ఇది నచ్చని కొందరు అభిమానులు సోషల్ మీడియాతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా ఎమ్మెస్కే వ్యాఖ్యలను సైటైర్లు విసురుతున్నారు. 

తాజాగా శుక్రవారం చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ తో ఈ ట్రోలింగ్స్ మరీ ఎక్కువయ్యాయి. ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో అనారోగ్యం కారణంగా కెప్టెన్, వికెట్ కీపర్ ధోని జట్టుకు దూరమయ్యాడు. దీంతో కెప్టెన్ బాధ్యతలు సురేశ్ రైనా స్వీకరించగా  వికెట్ కీపర్ బాధ్యతలు అంబటి రాయుడు తీసుకున్నాడు. ఇలా మొదటిసారి గ్లవ్స్ తొడుక్కుని వికెట్ల వెనుక నిలబడి రాయుడు తనలోకి కొత్త ఆటగాన్ని  భయటపెట్టాడు. 

ఇలా అంబటి రాయుడు కీపర్ అవతారమెత్తడాన్ని ఎమ్మెస్కేకు తెలియజేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో వేదికగా సెటైర్లు వేస్తున్నారు. '' మీరు త్రీడైమెన్షన్(బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) ఆటగాడైన విజయ్ శంకర్ ని ప్రపంచకప్ కు ఎంపిక చేసి ఫోర్ డైమెన్షన్( బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, కీపింగ్) ఆటగాడైన అంబటి  రాయుడిని వదిలిపెట్టారు'' అంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు. మరికొంత మంది '' ఎమ్మెస్కే గారు ఇది  చూశారా? '' అంటూ రాయుడు కీపింగ్ చేస్తున్న ఫోటోతో సెటైర్లు వేస్తున్నారు. 

 ఇక టీమిండియా మాజీ క్రికెటర్‌, ప్రస్తుత కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం రాయుడి కీపింగ్ ను ప్రశంసించాడు. ధోని జట్టుకు దూరమవడంతో కీపింగ్‌ బాధ్యతలు చక్కగా నిర్వర్తించిన రాయుడు తనలోని మరో ఆటగాన్ని బయటపెట్టాడు అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. 

మరిన్ని క్రీడా వార్తలు

ఈ ప్రపంచ కప్ త్రీడి కళ్లద్దాలతో చూస్తా: ఎమ్మెస్కేపై అంబటి రాయుడు వ్యంగ్యాస్త్రాలు

ప్రపంచ కప్ 2019: అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లకు గుడ్ న్యూస్

రాయుడిని సెలెక్టర్లెవ్వరూ వ్యతిరేకించలేదు...అయినా ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే...: చీఫ్ సెలెక్టర్

ప్రపంచ కప్ 2019: నాలుగో స్థానంపై క్లారిటీ ఇచ్చిన బిసిసిఐ

ప్రపంచ కప్ 2019: భారత జట్టు ఎంపికలో గవాస్కర్ అంచనాలు తలకిందులు

వరల్డ్ కప్ జట్టులో రిషబ్‌కు ఎందుకు స్థానం దక్కలేదంటే..: చీఫ్ సెలెక్టర్

ప్రపంచకప్‌ 2019: భారత జట్టిదే, రాయుడికి మొండిచేయి

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ

కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్... అరుదైన రికార్డు బద్దలు

మలింగ మాయాజాలం...ముంబై చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన చెన్నై