ఐపిఎల్ సీజన్ 12 లీగ్ దశలో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియంలో మరో అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ పైచేయిగా సాధించింది. ముంబై బౌలర్ మలింగ విజృంభణతో చెన్నై 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక చతికిల పడింది. మలింగ్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టి చెన్నై జట్టు నడ్డి విరిచాడు. 

మలింగ్ కు తోడుగా కృనాల్ పాండ్యా 2, బుమ్రా 2, హార్దిక్, రాయ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో చెన్నై జట్టు 109 పరుగులకే చాప చుట్టేసింది. చెన్నై బ్యాట్ మెన్స్ ముగ్గురు తప్ప మిగతావారంతా రెండంకెల వ్యక్తిగత స్కోరును కూాడా సాధించలేకపోయారు. మురళీ విజయ్ 38,బ్రావో 20, సాట్నర్ 22 పరుగులే చెన్నై ఇన్నింగ్స్ లో టాప్ స్కోర్లు. 

అంతకు ముందు ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు సాధించకుండా చెన్నై బౌలర్ సాట్నర్ అడ్డుకున్నాడు. అతడు నాలుగు ఓవర్లపాటు బౌలింగ్ చేసి కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అతడు తీసిన వికెట్లు టాప్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ రోహిత్ శర్మ, లూవిస్ వి కావడం విశేషం. ఇలా అతడి బౌలింగ్ దాటికి తట్టుకోలేక ముంబై కేవలం 155 పరుగులకే పరిమితమవ్వాల్సి వచ్చింది.

ముంబై బ్యాట్ మెన్స్ లో రోహిత్ 67, లూవిస్ 32, హార్దిక్ పాండ్యా 22 పరుగలతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో సాట్నర్ 2, చాహర్, తాహిర్ చెరో వికెట్ పడగొట్టాడు. బ్రావో వేసిన చివరి ఓవర్లో పొలార్డ్, పాండ్యాలు భారీ షాట్లతో విరుచుకుపడి 16 పరుగులు రాబట్టారు. దీంతో ముంబై ఈమాత్రం స్కోరయినా చేయగలిగింది.

డెత్ ఓవర్లలో పరుగుల వేగాన్ని పెంచడానికి ప్రయత్నించి ముంబై కెప్టెన్ రోహిత్ ఔటయ్యాడు.ఓపెనర్ గా బరిలోకి దిగి 3 సిక్సర్లు ఆరు ఫోర్ల సాయంతో 48 బంతుల్లోనే 67 పరుగులు చేసిన రోహిత్ చెన్నై బౌలర్ సాట్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. భారీ షాట్ కు ప్రయత్నించి విజయ్ కి సింపుల్ క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ కు చేరాడు. చెన్నై బౌలర్ మోయిన్ అలీ బౌలింగ్ భారీ షాట్ కు ప్రయత్నించి కృనాల్ పాండ్యా పెవిలియన్ కు చేరాడు. కేవలం ఒకే ఒక పరుగు మాత్రమే చేసి ఔటై ముంబై అభిమానులను నిరాశపర్చాడు.అంతకు ముందు దాటిగా ఆడే క్రమంలో లూవిస్ వికెట్ సమర్పించుకున్నాడు. 30 బంతుల్లో 32 పరుగులు చేసిన అతడు సాట్నర్ బౌలింగ్ ఔటయ్యాడు.

ముంబై ఇండియన్స్ జట్టుకి మ్యాచ్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ  తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి దాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన డికాక్ 9 బంతుల్లోనే 15 పరుగుల చేసి మంచి ఊపుమీదున్నట్లు కనిపించాడు. కానీ అతడి ఊపును చెన్నై చాహర్ అడ్డుకున్నాడు. తాను వేసిన మొదటి ఓవర్ల నాలుగో బంతికే డికాక్ ను ఓ అద్భుతమైన బంతికి బోల్తా కొట్టించి ఔట్ చేశాడు. దీంతో కేవలం 24 పరుగుల వద్దే ముంబై మొదటి వికెట్ కోల్పోయింది. 

చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మరో రసవత్తర సమరానికి రంగం సిద్దమైంది. ఇప్పటికే పాయింట్స్ టేబుల్  లో టాప్ లో వున్న చెన్నై సౌపర్ కింగ్స్, మూడో స్థానంలో వున్న ముంబై ఇండియన్ జట్లమధ్య మ్యాచ్ జరగనుంది. టాప్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానుల్లో కూడా దీనిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ప్లేఆఫ్ కు చేరుకున్న చెన్నై విజయపరంపరను కొనసాగించాలని చూస్తుండగా ముంబై ఈ మ్యచ్ గెలిచి ప్లేఆప్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని చూస్తోంది.  

టాస్ గెలిచిన ఆతిథ్య చెన్నై జట్టు మొదట పీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపింది. దీంతో  ముంబై మొదట బ్యాటింగ్ చేసింది. అయితే సొంత మైదానంలో ధోని ఆటను మరోసారి ఆస్వాదించాలనుకున్న అభిమానులకు ముంబై యాజమాన్యం షాకిచ్చింది. తీవ్ర అనారోగ్యం కారణంగా అతడు ఈ మ్యాచ్  ఆడటం లేదని ప్రకటించింది. దీంతో చెన్నై అభిమానుల్లో నిరాశతో పాటు మ్యాచ్ ఫలితంపై ఆందోళన నెలకొంది. 

చెన్నై జట్టు:

మురళీ విజయ్, షేన్ వాట్సన్, సురేశ్ రైనా (కెప్టెన్), కేదార్ జాదవ్, అంబటి రాయుడు(వికెట్ కీపర్), దృవ్, మిచెల్ సాట్నర్, డ్వేన్ బ్రావో, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్ 

ముంబై జట్టు: 

రోహిత్ శర్మ(కెప్టెన్),  డికాక్, లూవిస్, పొలార్డ్ , హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అనుకుల్ రాయ్, రాహుల్ చాహర్, బుమ్రా, మలింగ