ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ మెగా టోర్నీకోసం టీమిండియా సిద్దమయ్యింది. ఇప్పటికే ఇతర దేశాల క్రికెట్ మేనేజ్ మెంట్స్ ఈ టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించగా తాజాగా బిసిసిఐ కూడా ఆటగాళ్ల ఎంపికను చేపట్టింది. అయితే ఈసారి మంచి పామ్ లో వున్న తెలుగు ప్లేయర్ అంబటి రాయుడికి ప్రపంచ కప్ ఆడే అవకాశం వస్తుందని అందూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాయుడిని సెలెక్టర్ ప్రపంచ కప్ జట్టుకు దూరం పెట్టారు. ఇలా సెలెక్టర్ల నిర్ణయం క్రికెట్ ప్రియులను ముఖ్యంగా తెలుగు అభిమానులను ఎంతగానో బాధించింది. 

అయితే రాయుడుని భారత జట్టులో స్థానం ఎందుకు కల్పించలేకపోయారో టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియా ముందు బయటపెట్టారు. అతడు అద్భుతంగా ఆడుతున్నాడన్న విషయం సెలెక్షన్ కమిటీలోని  అందరికీ తెలిసన్నారు. కానీ రాయుడు, విజయ్ శంకర్ లలో ఎవరో ఒకరికే అవకాశమివ్వాలన్న సందిగ్ద సమయంలో సెలెక్టర్లందరూ  శంకర్ కే మద్దతిచ్చారు. శంకర్ అయితే బౌలింగ్ తో పాటు నాలుగో నెంబర్ బ్యాట్ మన్ గా రాణిస్తాడన్న  అభిప్రాయంతో అతడి  వైపు మొగ్గు చూపించారే తప్ప రాయుడు అంటే ఎవరికీ వ్యతిరేకత  లేదని ఎమ్మెస్కే వెల్లడించారు. 

ఇటీవల జరిగిన వన్డే మ్యాచుల ద్వారా అంబటి రాయుడు మంచి పామ్ లోకి వచ్చారు. అంతేకాకుండా టీమిండియాకు సమస్యగా మారిన నాలుగో స్ధానం, మిడిల్ ఆర్డర్ లో చక్కగా రాణించాడు. వన్డే యావరేజ్ విషయంలోనూ రాయుడు టాప్ ఆటగాళ్ల సరసన నిలిచాడు. టీమిండియా  కెప్టెన్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోని,, వైస్ కెప్టెన్ రోహిత్ తర్వాత నాలుగో అత్యధికి యావరేజ్ కలిగిన ఆటగాడు అంబటి. అతడి వన్డే బ్యాటింగ్ యావరేజ్ 47.5 గా వుంది. అయినప్పటికి అతడి కంటే  తక్కువ యావరేజ్ 42.18 కలిగి, నాలుగో స్థానంలో రాణించలేకపోయిన విజయ్ శంకర్ కి ప్రపంచ  కప్ జట్టులో స్థానం కల్పించడం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. 

టీమిండియా సెలెక్షన్ కమిటీ చీఫ్ గా ఓ తెలుగోడే వున్నప్పటికి తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి అన్యాయం జరుగుతుంటే ఏం చేశాడని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అతడిపైనే కాకుండా సెలెక్షన్ కమిటీలోని మిగతా సభ్యులపై కూడా తెలుగు అభిమానులు విరుచుకుపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

 ప్రపంచ కప్ 2019: నాలుగో స్థానంపై క్లారిటీ ఇచ్చిన బిసిసిఐ

ప్రపంచ కప్ 2019: భారత జట్టు ఎంపికలో గవాస్కర్ అంచనాలు తలకిందులు

వరల్డ్ కప్ జట్టులో రిషబ్‌కు ఎందుకు స్థానం దక్కలేదంటే..: చీఫ్ సెలెక్టర్

ప్రపంచకప్‌ 2019: భారత జట్టిదే, రాయుడికి మొండిచేయి

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ