ప్రపంచ కప్ మెగా టోర్నీ కోసం భారత జట్టును బిసిసిఐ ఎంపిక చేసింది. భారత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం ముంబైలో సమావేశమైన సెలక్షన్ కమిటీ, టీమిండియా కోచ్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో సమావేశమై జట్టు ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించగా అందులో యువ క్రికెటర్ రిషబ్ పంత్ పేరు లేకపోవడం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. అతడికి  తప్పకుండా ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కుతుందని అనుకుంటుండగా సెలెక్షన్ కమిటీ అతడికి మొండిచేయి చూపించింది. 

అయితే రిషబ్ పంత్ ను ప్రపంచ కప్ జట్టులో ఎందుకు స్థానం కల్పించలేకపోయారో టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాకు వివరించారు. ధినేశ్ కార్తిక్ తో పోలిస్తే పంత్ క్రికెట్ అనుభవం చాలా తక్కువని ఎమ్మెస్కే పేర్కొన్నారు. ఐపిఎల్ ఆటతీరును బట్టి చూస్తే కూడా పంత్ కంటే కార్తిక్ అద్భుతంగా రాణిస్తున్నాడన్నారు. ఇక కేవలం ధోని గాయపడి జట్టుకు దూరమైన సమయంలోనే సెకండ్ వికెట్ కీపర్ అవసరముంటుందని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఇలాంటి సమయంలో సీనియర్ ఆటగాడు వికెట్ కీపర్ గా వ్యవహరిస్తే బావుంటుందనే దినేశ్ కార్తిక్ ను ఎంపికచేసినట్లు ఎమ్మెస్కే వివరించారు. 

వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు కోసం ఆటగాళ్ల ఎంపిక జరిగినట్లు తెలిపారు. ప్రపంచ కప్ కోసం ఎంపికచేసిన కోహ్లీ సారథ్యంలోని జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్ మెన్స్, ఇద్దరు వికెట్ కీపర్లు, ముగ్గురు పాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు వుండేలా జాగ్రత్తపడ్డట్లు తెలిపారు. తమిళనాడుకు చెందిన ఆల్ రౌండర్ విజయ్ శంకర్ మూడు విభాగాలకు న్యాయం చేసేలా వుండటంతో ఎంపిక చేసినట్లు ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.  

 

సంబంధిత వార్తలు 

ప్రపంచకప్‌ 2019: భారత జట్టిదే, రాయుడికి మొండిచేయి

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ