ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌కు సమయం దగ్గర పడుతుండటంతో వివిధ దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆసీస్ 15 మందితో తమ జట్టును ప్రకటించింది. తాజాగా ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మందితో కూడిన జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్‌కప్‌కు సమయం దగ్గర పడుతుండటంతో వివిధ దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆసీస్ 15 మందితో తమ జట్టును ప్రకటించింది. తాజాగా ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మందితో కూడిన జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించింది.
చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం ముంబైలో సమావేశమైన సెలక్షన్ కమిటీ, టీమిండియా కోచ్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో సమావేశమై జట్టు ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్ల ప్రతిభ, ఫిట్‌నెస్‌తో పాటు పలు అంశాల ఆధారంగా సెలక్టర్లు సుధీర్ఘ కసరత్తు అనంతరం తుది జట్టును ప్రకటించారు.
రిషబ్ పంత్, అంబటి రాయుడులకు జట్టులో చోటు దక్కలేదు. దినేష్ కార్తిక్ ను రిజర్డ్వ్ వికెట్ కీపర్ గా తీసుకున్నారు. విజయ శంకర్ నాలుగో స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. కేదార్ జాదవ్ రవీంద్ర జడేజాలను తుది జట్టులో రొటేట్ చేసే అవకాశం ఉంది. యుకే వేదికగా మే 30వ తేదీ నుంచి ప్రపంచ కప్ జరగనుంది.
భారత జట్టిదే:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), దినేశ్ కార్తిక్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్, చాహల్, బుమ్రా,
సంబంధిత వార్తలు
