అమెరికా అధ్యక్షుడు తన స్వరం మార్చుకున్నాడు. తమ దేశానికి ఔషధం ఎగుమతిని నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే.. ప్రతీకారం తీర్చుకుంటానంటూ మాట్లాడిన ట్రంప్.. ప్రస్తుతం తన స్వరం మార్చుకున్నాడు. భారత  ప్రధాని నరేంద్ర మోదీపై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించాడు.

Also Read ట్రంప్ బెదిరింపులు... వెనక్కి తగ్గిన భారత్...

ఇంతకీ మ్యాటరేంటంటే..మలేరియా చికిత్సకు ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా సడలిస్తూ భారత్‌ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్-19 మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటంపై ప్రశంసలు కురిపించారు. 

ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడారు. 29 మిలియన్లకు పైగా హెచ్‌సీక్యూ డోసులు కొనుగోలు చేశామన్నారు. ఇందులో ఎక్కువగా భారత్ నుంచే వచ్చాయని చెప్పారు. దీనిపై భారత ప్రధాని మోదీతో తాను మాట్లాడనని ఆయన చెప్పారు.

మోదీ నిజంగా చాలా మంచివారంటూ ప్రశంసలు కురిపించారు. వాస్తవానికి భారత్‌లో కూడా ఇప్పుడు ఇవి చాలా అవసరం కావడంతో.. వాటిని పంపుతారా లేదా అని తాను మోదీని అడిగినట్లు  చెప్పారు. అయితే.. మోదీ తన మంచి మనసు చాటుకున్నారంటూ పొగడ్తలు కురిపించారు. 

తమ దేశంలో చాలా మందికి ఇప్పుడు ఆ మందులు అవసరమని చెప్పారు. తాను మంచి వార్తలు మాత్రమే వింటానని.. చెడు వార్తలు విననని అన్నారు. ప్రజల మరణాలకు కారణమయ్యే వార్తలు కూడా తాను వినాలని అనుకోవడం లేదని చెప్పారు.