Monkeypox: "నానాటికీ కేసులు పెరగవచ్చు..మరిన్ని మరణాలు సంభవించవచ్చు": WHO
Monkeypox: మంకీపాక్స్ కారణంగా మరోసారి WHO ఆందోళన చెందుతోంది. క్రమక్రమంగా Monkeypox కేసులు పెరగడంతో ప్రపంచ దేశాలను హెచ్చరిస్తుంది. మంకీపాక్స్ కేసులు నానాటికీ కేసులు పెరిగే అవకాశముందనీ, మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని WHO సీనియర్ ఎమర్జెన్సీ అధికారి కేథరీన్ స్మాల్‌వుడ్ హెచ్చరించారు.
Monkeypox: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోనేలేదు. ఇప్పుడు మరో కొత్త వైరస్ ప్రపంచ మానవాళిని ఆగం చేస్తుంది. భయాందోళనలోకి నెట్టి వేస్తుంది. అదే మంకీపాక్స్. కోతుల నుంచి వచ్చిన మంకీ పాక్స్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో మరోసారి వైరస్ పీయర్ పట్టుకుంది.
ఈ వైరస్ వల్ల భారత్‌తో సహా ఆఫ్రికా వెలుపల నాలుగు మరణాలు సంభవించాయి.
ఈ మరణాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అప్రమత్తమైంది. Monkeypox వల్ల మరిన్ని ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. Monkeypox గురించి డబ్ల్యూహెచ్‌ఓ - యూరప్‌కు చెందిన సీనియర్ ఎమర్జెన్సీ ఆఫీసర్ కేథరీన్ స్మాల్‌వుడ్ మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడూ పెరుగుతున్న మంకీపాక్స్ కేసుల దృష్ట్యా.. మరిన్ని మరణాలు సంభవించవచ్చుని హెచ్చరించారు. మంకీపాక్స్ వ్యాప్తిని ఆపాలని స్మాల్‌వుడ్ అన్నారు. అయినప్పటికీ, చాలా సందర్భాలలో వ్యాధి చికిత్స లేకుండా మెరుగుపడుతుందని స్మాల్‌వుడ్ నొక్కిచెప్పారు.
78 దేశాలలో మంకీపాక్స్ వ్యాప్తి..
WHO తాజా నివేదికల ప్రకారం.. మంకీపాక్స్ 78 దేశాలలో వ్యాప్తి చెందింది. 18,000 కంటే ఎక్కువ కేసులకు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఐదు మంకీపాక్స్ మరణాలు ఆఫ్రికాలో నమోదయ్యాయి. గత వారం స్పెయిన్ లో ఇద్దరు, బ్రెజిల్, భారత్ లో ఒక్కొక్కరు మరణించారు.
మంకీపాక్స్ బారినపడి కేరళకు చెందిన 22 ఏళ్ల యువకుడు శనివారం మృతి చెందాడు. మీడియా నివేదికల ప్రకారం.. అతడు.. జూలై 21 న UAE నుండి భారత్ కు తిరిగి వచ్చాడు. అనంతరం మెదడువాపు, జ్వరం రావడంతో జూలై 27 న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అతని శోషరస గ్రంథులు కూడా వాచిపోయాయి. పరీక్షించగా మంకీపాక్స్ అని నిర్థారణ అయ్యింది. ఈ క్రమంలో ఆదివారం చనిపోయాడు.
భారతదేశంలో ఇప్పటి వరకు నాలుగు Monkeypox కేసులు నమోదయ్యాయి, వాటిలో మూడు కేరళలో, ఒకటి ఢిల్లీలో నమోదయ్యాయి. ఈ క్రమంలో కేరళ నమోదైన Monkeypox కేసుకు నయం కావడంతో ఆ రోగి శనివారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు.