హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు విషయంలో భారత ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. రెండు రోజుల క్రితం హైడ్రాక్సీ క్లోరోక్విన్ ముందు ఎగమతిపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఇప్పుడు దానిపై వెనక్కి తగ్గింది. ఆ నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేసింది. కాగా.. ప్రతీకారం తీర్చుకుంటామంటూ ట్రంప్ బెదిరింపుల కారణంగానే భారత్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఇంతకీ మ్యాటరేంటంటే...కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఈ ప్రభావం అమెరికాలో మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అమెరికాలో పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరీ ఎంత దారుణంగా ఉందంటే....క‌రోనా దెబ్బకు అమెరికాలో ప్రతీ రెండున్నర నిమిషాలకు ఓ మరణం సంభవిస్తోంది.

Also Read కరోనా చిచ్చు... భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటానంటున్న ట్రంప్...

న్యూయార్క్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దేశంలో ఇప్పటి వరకు ప‌ది వేల మందికిపైగా మృత్యువాత పడగా, ఒక్క న్యూయార్క్‌లోనే 4,758 మంది మృతి చెందారు. ఇదిలా ఉండే.. అమెరికాకు అవసరమయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. 

అయితే మలేరియా నివారణకు ఉపయోగిస్తున్న  హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇప్పుడు కోరనా వైరస్ నివారణకు ఉపయోగిస్తుండటంతో ఆ మందుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవల ట్రంప్ ఫోన్ చేసి మరీ తమకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావాలని కోరగా... భారత్ నిరాకరించింది. దాని తర్వాతే ఆ మందు ఎగమతులపై నిషేధం కూడా విధించింది.

ఇదే మందు భారత్ కి కూడా అవసరం ఉండటంతో... ఇతర దేశాలను ఎగుమతిని నిలిపివేసింది. ఈ క్రమంలో..భారత్- అమెరికా మధ్య కరోనా మందు చిచ్చుపెట్టినట్లయ్యింది.

భారత్ డ్రగ్ ఇవ్వడానికి నిరాకరించడంతో ట్రంప్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. వాణిజ్య అంశాల్లో ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ట్రంప్ స్వయంగా చెప్పడం గమనార్హం

ట్రంప్ మాట్లాడుతూ...ఒకవేళ ఔషదాలను సరఫరా చేయవద్దనేదే మోదీ నిర్ణయమైతే.. అది తన తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని ట్రంప్ అన్నారు. ఆదివారం తాను మోదీతో మాట్లాడనని చెప్పారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఔషద అవసరం తమకు ఎంత ఉందో వివరించానని చెప్పారు.

అమెరికాకు ఆ ఔషదాన్ని సరఫరా చేయాలని కోరినట్లు చెప్పారు. నిషేదం ఎత్తివేయకపోతే ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుంది.

తాజాగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది.'కరోనా విజృంభణతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పలు దేశాలకు అవసరమైన డ్రగ్స్‌ అందజేస్తాం. ఔషధాల పంపిణీపై వస్తోన్న కొన్ని ఊహాగానాలకు, ఈ విషయాన్ని రాజకీయం చేయాలనుకుంటున్న ప్రయత్నాలకు చెక్‌ పెడతాం' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

'కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో పారాసిటిమల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు మొత్తం 14 రకాల ఔషధాలను తగిన మోతాదులో మన పొరుగుదేశాలకు కూడా అందిస్తుంది. మన సామర్థ్యంపై ఆధారపడిన పొరుగుదేశాలకు పంపిణీ చేస్తాం' అని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ ప్రకటన చేశారు. భారత్‌ ఎల్లప్పుడూ ఇతర దేశాలకు సహకారం అందించాలన్న దృక్పథంతోనే ఉంటుందని తెలిపారు. కొన్ని ఔషధాల విషయంలో మత్రమే ఈ తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.