Asianet News TeluguAsianet News Telugu

భారీగా త‌గ్గిన కోవిడ్-19 కొత్త కేసులు.. 24 మంది మృతి

COVID-19: దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తత పెంచాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. అయితే, తాజాగా దేశం మొత్తం గ‌ణాంకాలు తీసుకుంటే కొత్త కేసులు భారీగా త‌గ్గాయి.
 

Coronavirus updates in india: New covid-19 cases drop sharply 24 deaths recorded RMA
Author
First Published Apr 25, 2023, 5:02 PM IST

Coronavirus updates in india: దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తత పెంచాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. అయితే, తాజాగా దేశం మొత్తం గ‌ణాంకాలు తీసుకుంటే కొత్త  కేసులు భారీగా త‌గ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,660 కరోనా కేసులు, 24 మరణాలు సంభ‌వించాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 63,380కి చేరుకుంది. 

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. గత 24 గంటల్లో భారతదేశంలో 6,660 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 24 పెరిగింది. దీంతో దేశంలో కోవిడ్-19 వెలుగుచూసిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కోవిడ్ మ‌ర‌ణాలు 5,31,369కి పెరిగాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 63,380గా ఉంది.

రోజువారీ పాజిటివిటీ రేటు 3.52 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 5.42 శాతంగా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.14 శాతం ఉండగా, జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.67 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,11,078కి చేరుకుంది. మ‌రణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లకు పెరిగింది.

ఎక్స్ బీబీ.1.16 వేరియంట్ కార‌ణంగానే.. 

ప్ర‌స్తుతం ప‌లు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. క‌రోనా వైర‌స్ కేసులు, మ‌ర‌ణాల్లో ప్రపంచవ్యాప్తంగా పెరుగుదలకు కారణమైన ఎక్స్ బీబీ.1.16 వేరియంట్ ప్ర‌భావం అధికంగా ఉంది. 33 దేశాలలో ఉన్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్  ఎక్స్ బీబీ.1.16..  ఇటలీ,యూఎస్, యూకే, వియత్నాం, భారతదేశంతో సహా ఇతర దేశాలలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు, మరణాలలో కొత్త పెరుగుదలను సృష్టిస్తోంది. ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఏప్రిల్ 14-20 మధ్య దేశంలో 27,982 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారం (21,779)తో పోలిస్తే. మరణాల సంఖ్య కూడా 48.1 శాతం పెరిగింది. దాదాపు 200 వ‌ర‌కు మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుండి తాజా అంచనాల ప్రకారం, సబ్ వేరియంట్ ఎక్స్ బీబీ.1.16 ఈ వారం కొత్త ఇన్ఫెక్షన్లలో 9.6 శాతం ఉంది. అంతకుముందు వారం దాదాపు 6 శాతం, రెండు వారాల క్రితం 3 శాతంగా ఉంది. రానున్న రోజుల్లో దీని పెరుగుద‌ల మ‌రింత‌గా ఉంద‌వ‌చ్చున‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios