Asianet News TeluguAsianet News Telugu

బ్యాన్ చైనా అన్నంత వీజీ కాదు చైనా వస్తువులను వదిలించుకోవడం

చైనా ఉత్పత్తుల జోలికెళ్లకుండా ఉండాలంటే, దేశీయంగా విడి భాగాల తయారీ సామర్థ్యం పెంచుకోవాలని నిపుణులు, మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అలా కాకుండా సుంకాలు పెంచినా నష్టపోయేది మన వినియోగదారులేనని హచ్చరిస్తున్నారు. 
 

it is Not easy to reject China products. Says experts
Author
Hyderabad, First Published Jun 20, 2020, 1:53 PM IST

న్యూఢిల్లీ: ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘చైనా వస్తువు’ల బహిష్కరణ ప్రచారోద్యమం హోరెత్తుతున్నది. అయితే తక్షణం చైనా ఉత్పత్తుల బహిష్కరణ మనం మాట్లాడుకునేంత ఈజీ కాదు. డ్రాగన్‌‌‌‌ను నిందించేందుకు వెంటనే సిద్ధపడితే.. నష్టపోయేది మన కస్టమర్లేనని ఆర్థికవేత్తలు, మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. 

ఎందుకంటే చైనా ఉత్పత్తులన్నీ చాలా చౌకగా దొరికేవే. అవే ప్రొడక్ట్స్‌‌‌‌ను ఇండియాలో తయారు చేసినా, కచ్చితంగా ధరలు ఎక్కువే, ఇక్కడి కస్టమర్లు ఎక్కువ రేట్లకే కొనుక్కోవాల్సి వస్తుందన్న మాట. చైనా మీద ఆధారపడటం తగ్గించుకోవాలనే ఆలోచన మంచిదైనా ప్రణాళికా బద్ధమైన విధానా అమలుతోనే సాధ్యమని విశ్లేషకులు అంటున్నారు. 

భారతదేశంలో తెస్తున్న భారీ సంస్కరణలతో ఫార్మా నుంచి మొబైల్స్‌‌‌‌, ఆటో విడి భాగాల వరకు వివిధ రంగాలలో దేశీయ పరిశ్రమ ఎదిగే అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికి కొన్నేళ్ల టైం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సరిహద్దుల్లో చైనా దూకుడుకు ప్రతిగా ఆ దేశంతో ఆర్థిక సంబంధాలను మనం తెంచుకోవాలనుకుంటే, అదంత సులభం కాదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల‌‌‌తో బీజింగ్‌‌‌‌పై దేశంలో వ్యతిరేకత పెరిగిన మాట నిజమే. దీంతో చైనా ఉత్పత్తుల నిషేధ నినాదం‌‌‌ మరోసారి ఊపందుకుంది.

కాకపోతే, వాస్తవాలు మరోలా ఉన్నాయి. చైనా ఉత్పత్తుల‌‌‌పై మన దేశంలోని కన్స్యూమర్లే కాకుండా, మన పరిశ్రమలూ చాలా ఎక్కువే ఆధారపడుతున్నాయి. కాబట్టే ఈ నినాదాలు నిజమవడం కొంచెం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 

చైనా చౌక ఉత్పత్తుల‌‌‌ను భారతీయులు‌‌‌ కొనకుండా నిరుత్సాహపరిచేలా విధానాలు తెస్తే, షార్ట్‌‌‌‌ టర్మ్‌‌‌‌లో ఆయా వస్తువులకు వినియోగదారులుఎక్కువ ధరలు పెట్టాల్సి వస్తుంది. కరోనా వైరస్‌‌‌‌ రాకతో యాక్టివ్‌‌‌‌ ఫార్మా ఇన్‌‌‌‌గ్రీడియెంట్స్‌‌‌‌ (ఏపీఐ) ధరలు ఈ ఏడాది జనవరి మొదటి నుంచి ఇప్పటిదాకా చూస్తే, ఆరు నుంచి 167% దాకా పెరిగాయి. ఇందులో నిమ్స్‌‌‌‌లైడ్‌‌‌‌ రేటు బాగా ఎక్కువగా పెరిగింది. చైనా నుంచి సప్లై తగ్గిపోవడమే ఈ ఏపీఐల రేట్లు పెరగడానికి కారణం.

also read 3 నెలల్లోనే రూ.50 లక్షల కోట్ల నష్టం ! వ్యాక్సిన్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే.. ...

సరిహద్దుల్ో 20 మంది ఇండియా సైనికులు చనిపోయినా, చైనా ఉత్పత్తులు వేటినీ ప్రభుత్వం ఇంకా నిషేధించలేదు. కాకపోతే, కాన్ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఆల్‌‌‌‌ ఇండియా ట్రేడర్స్‌‌‌‌ (సెయిట్‌‌‌‌) వంటి సంస్థలు  వాటిని బాయ్‌‌‌‌కాట్‌‌‌‌ చేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్నాయి.

ఇండియా ఎలక్ట్రానిక్స్‌‌‌‌ దిగుమతుల్లో 45 శాతం చైనావే. కొన్ని మొబైల్‌‌‌‌ విడి భాగాలైతే ఏకంగా 90 శాతం అక్కడి నుంచే దిగుమతి అవుతున్నాయి. యాక్టివ్‌‌‌‌ ఫార్మా ఇన్‌‌‌‌గ్రీడియెంట్స్‌‌‌‌లో 65–70 శాతం మనం చైనా నుంచే కొంటున్నాం.

ఆటోమోటివ్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌, ఫెర్టిలైజర్స్‌‌‌‌లో నాలుగో వంతును చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. కోవిడ్‌‌‌‌–19 సందర్భంగా ఫిబ్రవరిలో సీఐఐ రూపొందించిన నోట్‌‌‌‌ ఈ డేటాను వెల్లడిస్తోంది.  ఇండియా అత్యధికంగా ఉత్పత్తులను చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. గత ఆర్థిక సంవత్సరం (2019–20) మొదటి 11 నెలల్లో చూస్తే ఆ దేశపు ట్రేడ్‌‌‌‌ సర్‌‌‌‌ప్లస్‌‌‌‌ కూడా ఏకంగా 47 బిలియన్‌‌‌‌ డాలర్లుగా ఉంది. 

ఇండియా మొబైల్‌‌‌‌ ఫోన్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ విలువ రూ. 2 లక్షల కోట్లయితే, ఇందులో 72 శాతం వాటా చైనా కంపెనీలదే. షవోమి వంటి చైనా బ్రాండ్లే ఇండియా మార్కెట్లో అధిపత్యం చూపుతున్నాయి. కొన్ని చైనా కంపెనీలు, మరికొన్ని ఇండియా కంపెనీలు మొబైల్‌‌‌‌ ఫోన్స్‌‌‌‌ను ఇక్కడ అసెంబుల్‌‌‌‌ చేస్తున్నా, కాంపోనెంట్స్‌‌‌‌ను మాత్రం చైనా నుంచే దిగుమతి చేసుకోవడం విశేషం.

మన టెలికం ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌ మార్కెట్లో చైనా వాటా 25 శాతం. ఈ విభాగంలో చాలా అమెరికా, యూరప్‌‌‌‌ కంపెనీలు కూడా ఉన్నాయి. దీంతో చైనా ప్రొడక్ట్స్‌‌‌‌ను బ్యాన్‌‌‌‌ చేయడం సాధ్యమే అయినా, టెలికం ఆపరేటర్లకు కనీసం 15 శాతం ఖర్చు పెరుగుతుంది. చైనా వెండార్లు ఇండియా ఆపరేటర్లకు ఇస్తున్న ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్‌‌‌‌ సదుపాయం పోతుంది.

ఇండియా స్మార్ట్ టీవీ మార్కెట్లోనూ  45 శాతం వాటాను చైనా చేజిక్కించుకుంది. ప్రత్యర్ధులతో పోలిస్తే చైనా ప్రొడక్ట్స్‌‌‌‌ ధరలు 30 నుంచి 50 శాతం తక్కువ. సంస్థాగత సంస్కరణలతోపాటు  విధానపరమైన జోక్యంతో ఫార్మా నుంచి మొబైల్స్, ఆటో పార్ట్స్‌‌‌‌ దాకా ఇండియాలో కెపాసిటీ పెంచాలన్నా, కొన్నేళ్లలోనే సాధ్యపడుతుంది. చైనా దిగుమతులను వెంటనే ఆపేయాలంటే వీలు పడదని ఆటోమోటివ్‌‌‌‌ కాంపోనెంట్‌‌‌‌ మాన్యుఫాక్చరర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ జనరల్‌‌‌‌ విన్నీ మెహతా చెప్పారు.

ఐతే, ఇండియాలో అదే వ్యాల్యూ చెయిన్‌‌‌‌ను మనం ఏర్పాటు చేసుకోలగలమని విన్నీ మెహతా తెలిపారు. ఇండియాలోని స్కిల్స్‌‌‌‌, క్వాలిటీ వల్ల ఇది సాధ్యమవుతుందని అన్నారు. దాంతో చైనా మీద ఆధారపడటం క్రమంగా తగ్గిపోతుందని చెప్పారు. ఇండియా ఆటో పార్ట్స్‌‌‌‌ దిగుమతులు ప్రస్తుతం 18 బిలియన్‌‌‌‌ డాలర్ల దాకా ఉంటున్నాయి.

ఈ విభాగంలో ఇండియా నుంచి చైనాకు ఎగుమతులు చూస్తే ఏటా కేవలం 300 మిలియన్‌‌‌‌ డాలర్లు. చైనా అధిపత్యం వివిధ రంగాలలో తగ్గించాలంటే వెంటనే సాధ్యపడదని ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్నేళ్లపాటు మనం చొరవ తీసుకుని, సామర్ధ్యాన్ని భారీగా పెంచుకున్నప్పుడే అది వీలవుతుందని పేర్కొంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios