Asianet News TeluguAsianet News Telugu

హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌తో ఉపయోగం ఏంటి?! ట్రంప్‌కు దానిపై ఎందుకంత ఇంట్రెస్ట్?

కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధానికి పుష్కలంగా డిమాండ్ వస్తోంది. ఈ డ్రగ్ 1980ల్లో భారతదేశంలో మలేరియా మహమ్మారిని ఆటకట్టించేందుకు దోహద పడింది. నాటి నుంచి ఇప్పటి వరకు అది యాంటీ వైరల్ డ్రగ్ గా ప్రసిద్ధి. కానీ కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళికే సవాల్ విసురుతోంది. ఈ క్రమంలో దాని నివారణకు చైనా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ వాడి జయం సాధించింది. ఇతర దేశాలు అదే పని చేశాయి. నూతన డ్రగ్ తయారీలోనూ ఈ ఔషధం అంతే కీలకం. అందుకే అమెరికా అద్యక్షుడు ట్రంప్.. తమకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ పంపమని భారత ప్రధాని మోదీని కోరారు.
 

India Bans All Exports of Virus Drug Often Touted by Trump
Author
Hyderabad, First Published Apr 6, 2020, 11:50 AM IST

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ మహమ్మారితో అల్లాడుతున్నాయి. వైద్య పరంగా కరోనాను నివారించడానికి ఏ దేశం వద్ద కూడా సరైన ఔషధమే లేదు. వివిధ దేశాలు తమకు అందుబాటులో ఉన్న యాంటీ వైరల్, యాంటీ బయాటిక్స్ ఔషధాలు వాడుతున్నాయి. మరోవైపు క్లినికల్ ట్రయల్స్ చేపట్టాయి. 

వైద్య నిబంధనల ప్రకారం ఒక ఔషధాన్ని ఖరారు చేయాలంటే కనీసం 18 నెలలు పడుతుందని వివిధ వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సరైన డ్రగ్‌ను నిర్ధారించే లోపు అందుబాటులో ఉన్న ఔషధాల వాడకం ద్వారా మహమ్మారి రోగాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నాయి వివిధ దేశాలు.

ఆ బాటలోనే అమెరికా వెళుతున్నది. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధం ఎగుమతి చేయమని భారతదేశాన్ని కోరుతున్నారు.

హెచ్ఐవీ, ఎయిడ్స్, యాంటీ మలేరియా తదితర ప్రాణాంతక వ్యాధులను నివారించడానికి వాడిన, రూపొందించిన టాబ్లెట్లు, ఇతర ఔషధాలను వినియోగిస్తున్నాయి. ఈ మహమ్మారి పుట్టుకకు వేదికగా మారిన చైనాలో కూడా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధంతోనే దాన్ని అదుపులోకి తీసుకొచ్చారని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధాన్ని 1980వ దశకంలో మలేరియా వ్యాధిని నివారించడానికి భారతదేశంలో వినియోగించారు. తర్వాతీ కాలంలో క్రమంగా ప్రజల్లో అవగాహన పెరిగిపోయింది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఇతర ఔషధాలు వినియోగంలోకి వచ్చాయి. యాంటీ వైరల్ డ్రగ్‌గా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ నిలిచింది. 

భారతదేశానికి వచ్చే సరికి కొవిడ్-19 నివారణకు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ.. అత్యవసర సమయంలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్, అజిత్రోమైసిన్ ఔషధాలను వినియోగించాలని సిఫారసు చేసింది. 

అందరికీ హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధం వాడకం వల్ల సమస్యలు ఉన్నాయని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ హై రిస్క్ కేసుల్లో మాత్రమే వాడాలన్న సూచనలు ఉన్నాయి. 

హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌తోపాటు అజిత్రోమైసిన్ వాడకంతో సత్ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. అనుమానితులతోపాటు ఈ నేపథ్యంలో ధ్రువీక్రుత కేసులకే వీటిని వాడాలని హైల్త్ కేర్ వర్కర్లను సూచిస్తోంది. రెటినోపతి అంటే హైపర్ సెన్సివిటీ సమస్య ఉన్న వారికి మాత్రం దీన్ని వాడొద్దని కూడా స్పష్టంగా జాతీయ స్థాయి కొవిడ్-19 టాస్క్ ఫోర్స్ సిఫారసు చేసింది. 15 ఏళ్ల లోపు బాలలకు వాడాలని సూచించింది.  

అమెరికాలో ప్రస్తుతం కరోనా వైరస్ మరణ మ్రుదంగం మోగిస్తున్నది. ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నదీ అగ్రరాజ్యంలోనే. ఈ నేపథ్యంలో ట్రంప్ తమకు భారీగా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధాలను సరఫరా చేయాలని భారత ప్రధాని మోదీని కోరారు. 

ఇంతకుముందు కూడా అమెరికా భారతదేశంలోని పలు ఔషధాల తయారీ సంస్థలతో తమకు గల భాగస్వామ్య ఒప్పందాలకు అనుగుణంగా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధాలను సరఫరా చేయాలని కోరాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. అప్పటికే కరోనా వైరస్ తీవ్రత దేశీయంగా పెరుగుతున్న సంగతిని పరిగణనలోకి తీసుకుని క్లోరోక్వీన్, అజిత్రోమైసిన్ ఔషధాల ఎగుమతులను నిషేధించింది. 

అమెరికాలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ కారణంగా ఆ దేశంలో ఇప్పటివరకు 7వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3లక్షల మందికిపైగా వ్యాధి బారినపడ్డారు. దీంతో హైడ్రాక్సీ క్లోరోక్వీన్​ను తమకు ఎగుమతి చేయాలని భారత ప్రధాని నరేంద్రమోదీని కోరినట్లు చెప్పారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​. భారత్​ భారీ స్థాయిలో వీటిని తయారు చేస్తోందన్నారు. తన అభ్యర్థనను సీరియస్ తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు

దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో వణికిపోతున్న వేళ.. దాని నియంత్రించే సామర్థ్యం గల వ్యాక్సిన్ తయారీలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్ డ్రగ్ కీలక పాత్ర పోషించనున్నది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు తమ దగ్గర ఆ డ్రగ్ కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా ఎగుమతులపై ఆంక్షలు విధించాయి. భారత్ ఇప్పటికే ఎగుమతులపై ఆంక్షలు విధించింది. తాజాగా మరింత కట్టుదిట్టం చేసింది. 

తాజాగా ఎగుమతులు చేయడానికి మాత్రమే ఈ డ్రగ్‌ను తయారు చేసే సెజ్‌లకు కూడా ఆంక్షలు వర్తించేలా కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం అప్పటికే ముందస్తు ఒప్పందం చేసుకున్న ఎగుమతులను విరమించుకోవాలని ఆయా సంస్థలను ఆదేశించింది. 

హైడ్రాక్సీ క్లోరోక్వీన్ తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలను మాత్రం జీరో సుంకంతో దిగుమతి చేసుకోవడానికి ఫార్మా సంస్థలకు కేంద్రం అనుమతినిచ్చింది. మామూలుగాఅయితే ఇటువంటి ఎగుమతి ప్రధాన వస్తువులను తయారు చేసే సెజ్ లకు ఆంక్షలు వర్తించవు. కానీ దేశీయంగా కరోనాను కట్టడి చేయడానికి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ అవసరం చాలా ఉంది. అందుకే దేశీయంగా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ నిల్వలు సరిపడా ఉండేలా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios