Asianet News TeluguAsianet News Telugu

మీ అక్కౌంట్ నుండి డబ్బు పోయిందా… అయితే బ్యాంకులదే బాధ్యత.. ఈ విషయాన్ని తెలుసుకోండి..

ఖాతాదారుడి నగదును అతడి ప్రమేయం లేకుండా ఉపసంహరిస్తే దానికి బ్యాంకులే బాధ్యత వహించాలని జాతీయ వినియోగదారుల కమిషన్ గతంలో ఒక తీర్పును కూడా ఇచ్చింది. దానికి ఆర్‌బి‌ఐ సైతం అంగీకరిస్తూ కొన్ని నియమ నిబంధనలు సైతం 2018లో రూపొందించింది. 

bank will responsible for  hacking fraud not customer ncdrc order says rbi policy check details here
Author
Hyderabad, First Published Jan 5, 2021, 2:07 PM IST

 న్యూ ఢీల్లీ: జాతీయ వినియోగదారుల కమిషన్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా నుండి హ్యాకర్లు మోసపూరితంగా డబ్బును ఉపసంహరిస్తే, అక్కౌంట్ హ్యాక్ చేస్తే, హ్యాకర్లు క్రెడిట్ కార్డు మోసాలకి పాల్పడితే ఆ నష్టానికి సదురు బ్యాంక్ పూర్తి బాధ్యత  వహించాలని ఆర్‌బి‌ఐ ఆదేశించింది. 

ఖాతాదారుడి నగదును అతడి ప్రమేయం లేకుండా ఉపసంహరిస్తే దానికి బ్యాంకులే బాధ్యత వహించాలని జాతీయ వినియోగదారుల కమిషన్ గతంలో ఒక తీర్పును కూడా ఇచ్చింది. దానికి ఆర్‌బి‌ఐ సైతం అంగీకరిస్తూ కొన్ని నియమ నిబంధనలు సైతం 2018లో రూపొందించింది.

దాని ప్రకారం ఒక వ్యక్తి అకౌంట్ హ్యాకింగ్‌కు గురైతే ఎవరు బాధ్యత వహించాలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బ్యాంకు నుంచి పొరపాటు, బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల కారణంగా తప్ప జరిగితే అప్పుడు కస్టమర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మొత్తం నష్టాన్ని బ్యాంకులే భరించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా నష్ట నివారణ, గుర్తింపు వంటి విషయాల్లోనూ కొంత స్పష్టతను ఇచ్చే ప్రయత్నం ఆర్‌బి‌ఐ, వినియోగదారుల ఫోరం చేశాయి.

ఒక వేళ కస్టమర్ తప్పు లేదా బ్యాంకు తప్పు లేని పరిస్థితిలో కస్టమర్ మోసం జరిగిన 3 బ్యాంకు పని దినాలలో సదురు  బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. అలాగే 4-7 రోజుల్లో ఫిర్యాదు చేస్తే, కస్టమర్ 5వేల – 25వేల రూపాయలు పొందే వెసులుబాటును కల్పించింది. 7 పనిదినాల తర్వాత కస్టమర్ తనకు జరిగిన మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేస్తే, అటువంటి సందర్భాలలో బ్యాంక్ విధానం ఏమిటో దానిపై ఆధారపడి ఉంటుందని వివరించింది.

2007 లో మహారాష్ట్రలోని థానేలో నివసించిన ఒక వ్యక్తి తండ్రి, అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్న తన కొడుకు జెస్నా జోస్ కోసం ప్రీపెయిడ్ ఫారెక్స్ ప్లస్ కార్డు తీసుకున్నాడు. ఆ తరువాత డిసెంబర్ 2008లో జెస్నా జోస్ తండ్రి 10, 310 ఉపసంహరించుకున్నట్లు ధృవీకరించమని బ్యాంక్ కోరింది. అయితే జెస్నా జోస్ తండ్రి అలాంటి లావాదేవీలను జరపలేదని  తెలిపాడు. దీని తరువాత డిసెంబర్ 14 నుండి 20 మధ్య 6 వేల డాలర్లను వారి ఖాతా నుండి ఉపసంహరించుకున్నట్లు బ్యాంక్ తెలిపింది.

also read క్రీడిట్, డేబిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త.. మీ ఖాతాలో డబ్బు ఎప్పుడైనా మాయం కావొచ్చు.. ...

దీనిపై, లాస్ ఏంజిల్స్‌లోనే ఉండే జెస్నా తన తండ్రి ఖాతా హ్యాక్ చేయబడిందని గుర్తించాడు. బాధితుడు మహారాష్ట్ర జిల్లా వినియోగదారుల ఫోరమ్‌కు ఫిర్యాదు చేసి పరిహారం కోరాడు. ఫోరమ్ జెస్సేనాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అలాగే  ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ బ్యాంక్ జాతీయ వినియోగదారుల కమిషన్‌ను సంప్రదించింది. అక్కడ బ్యాంక్ కు  నిరాశ ఎదురైంది.

బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్‌ను కమిషన్ తిరస్కరించి బాధితురాలికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం, బాధిత మహిళను US $ 6110 తో 12 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని బ్యాంకును ఆదేశించారు. అదనంగా, బాధితురాలికి రూ .40 వేలు పరిహారంగా, కేసు ఖర్చులకు రూ .5000 చెల్లించాలని బ్యాంక్ ఆదేశించింది.

2017-18 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాకింగ్‌కు ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టం చేసింది. ఆర్‌బిఐ నివేదిక ప్రకారం, హ్యాకింగ్ నష్టాన్ని ఎవరు భరిస్తారు, అది ఎవరి తప్పు అని ఎలా నిర్ణయిస్తారు?  అనే ప్రశ్నలకు ఆర్‌బిఐ నిబంధనల ప్రకారం, బ్యాంకు వైపు నిర్లక్ష్యం లేదా పొరపాటు ఉంటే, అప్పుడు కస్టమర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సదురు మొత్తం నష్టాన్ని బ్యాంకు భరిస్తుంది అని వివరించింది.

అలాగే కస్టమర్ నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే, కస్టమర్ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. కస్టమర్ తప్పు లేదా బ్యాంకు తప్పు లేని పరిస్థితిలో కస్టమర్ మోసం జరిగిన 3 పని దినాలలోపు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే, అప్పుడు కస్టమర్ తనకి జరిగిన మోసానికి బాధ్యత వహించనవసరం లేదు. 4-7 రోజుల్లో ఫిర్యాదు చేస్తే కస్టమర్ 5000-25000 రూపాయల వరకు నష్టాన్ని పొందుతారు. 7 పనిదినాల తర్వాత కస్టమర్ మోసం ఫిర్యాదు చేస్తే, అటువంటి సందర్భాలలో బ్యాంక్ విధానం ఏమిటో ఆధారపడి ఉంటుంది.

ఖాతాదారులకు జరిగే మోసాల విషయంలో ఖాతాదారుల నగదుకు భద్రత వహించాల్సింది బ్యాంకులేనని, బ్యాంకింగ్ లోపాలను సరిదిద్దు కోవాలని, కస్టమర్ల ఖాతాలకు, నగదుకు బాధ్యత వహించాల్సింది బ్యాంకులేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జాతీయ వినియోగదారుల ఫోరం స్పష్టం చేశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios