Asianet News TeluguAsianet News Telugu

కాఫీ కింగ్ కన్నుమూత... తోటి పారిశ్రామికవేత్తలకు ఆనంద్ మహీంద్రా నోట్

కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని తన తోటి పారిశ్రామికవేత్తలకు ఆనంద్ మహీంద్రా సూచించారు. వ్యాపారంలో వచ్చిన నష్టాలకు తమ ఆత్మ గౌరవాన్ని నాశనం చేసే ఛాన్స్ ఇవ్వొద్దని అదే జరిగితే పారిశ్రామికం అంతమైనట్లేనని పేర్కొన్నారు.

Anand Mahindra's Note To Entrepreneurs In Cafe Coffee Day Boss's Case
Author
Hyderabad, First Published Jul 31, 2019, 4:45 PM IST

కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ మృతి చెందడంపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సిద్థార్థ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్రా... పారిశ్రామిక దిగ్గజాలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని తన తోటి పారిశ్రామికవేత్తలకు ఆనంద్ మహీంద్రా సూచించారు. వ్యాపారంలో వచ్చిన నష్టాలకు తమ ఆత్మ గౌరవాన్ని నాశనం చేసే ఛాన్స్ ఇవ్వొద్దని అదే జరిగితే పారిశ్రామికం అంతమైనట్లేనని పేర్కొన్నారు.

‘‘నాకు ఆయన గురించి తెలియదు.. ఆయన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా తెలీదు. కానీ నాకు తెలిసిందల్లా పారిశ్రామికవేత్తలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వ్యాపారంలో వచ్చిన నష్టాలను ఎదుర్కోవాలి. తమ ఆత్మ గౌరవాన్ని నాశనం చేసే అవకాశం ఇవ్వొద్దు. ఇది పారిశ్రామిక రంగం అంతానికి దారి తీస్తుంది.’’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. కాగా.... ఆయన మృతదేహం బుధవారం ఉదయం నేత్రావతి నది లో లభించింది. ఓ వ్యక్తి ఆ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం తాను చూశానంటూ స్థానికులు ఒకరు చెప్పడం గమనార్హం. వ్యాపారంలో లాభాలు రావడంలేదని ఇబ్బందులు ఎక్కువయ్యాయనే బాధతో ఆయన తన బోర్డు సభ్యులకు  లేఖ రాసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. సిద్ధార్థ కర్నాటక మాజీ  ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ అల్లుడు కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ

విషాదాంతం: నేత్రావతిలో శవమై తేలిన కాఫీ డే అధినేత సిద్ధార్ధ్

అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: బ్రిడ్జి నుండి దూకడం చూశా, కానీ...

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: కీలక సమాచారమిచ్చిన డ్రైవర్

సిద్ధార్థ అదృశ్యం... కేఫ్ కాఫీడే ఉద్యోగులకు సెలవు

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...

Follow Us:
Download App:
  • android
  • ios